
న్యూయార్క్: యూఎస్‌ఏలో ఉండే భారతీయ అమెరికన్లు నిత్యం జాతి వివక్షకు గురవుతున్నట్లు తేలింది. ఆసియా–అమెరికన్ల జీవనంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘అమెరికాలో వివక్ష’ అంశంపై నేషనల్ పబ్లిక్ రేడియో, రాబర్ట్ వుడ్ జాన్సన్ ఫౌండేషన్, హార్వర్డ్ టీహెచ్ చాన్ పబ్లిక్ హెల్త్ స్కూల్ కలిసి చేపట్టిన సర్వే ఫలితాలను ఇటీవల విడుదల చేశారు.
ఈ సర్వేలో పాల్గొన్న ఆసియన్ అమెరికన్లు... తమను గానీ తమ కుటుంబసభ్యులను గానీ పోలీసులు అనవసరంగా ఆపి ప్రశ్నలతో వేధించటం, వివక్ష చూపటం వంటివి నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. ఈ విషయంలో చైనీస్ అమెరికన్ల కంటే కూడా భారతీయ సంతతి వారే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడయింది. రెండు శాతం మంది చైనీస్ అమెరికన్లు మాత్రమే పోలీసులు తమపై వివక్ష చూపుతున్నట్లు తెలపగా, పోలీసులు మార్గమధ్యలో అనవసరంగా ఆపటం, ప్రశ్నలతో వేధించటం వంటివి చేస్తున్నట్లు 17% మంది భారతీయ సంతతి వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment