ఇప్పటికీ తప్పని జాతి వివక్ష
న్యూయార్క్: గాంధీజీని నల్లజాతీయుడైన కారణం చేత రైల్లోంచి దించేశారని చదివినప్పుడు ఆశ్చర్యపోయాం. ఆ రోజులు ఇప్పుడు లేవులే అని సరిపెట్టుకున్నాం. అయితే ఇప్పటికీ అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ నియామకాల్లో జాతివివక్ష కొనసాగుతూనే ఉందని న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఇతర దేశాల నుంచి ఉద్యోగావకాశాల కోసం అమెరికాకు వెళ్లిన వారిలో తెల్లజాతీయులకు దక్కుతున్నన్ని అవకాశాలు, నల్లజాతీయులకు ఉండటం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా ఆసియా నుంచి వెళ్లిన వారు నల్లజాతీయులనే కారణం చేత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్న వారిలో ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారని, ప్రస్తుతం అమెరికా జనాభాలో వీరి సంఖ్య వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. పురుషులతో పోల్చుకుంటే నల్లజాతి మహిళలను మరింత చులకనగా చూస్తున్నట్టు వెల్లడైంది. ఉదాహరణకు లాటిన్ అమెరికా, ఆసియా ప్రాంతాల నుంచి వెళ్లిన మహిళల్లో అగ్రభాగం ఉద్యోగాలు లాటిన్ అమెరికా మహిళలకే వస్తున్నట్టు చెప్పారు.