న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది.
పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment