reasearch
-
ఎగిరొచ్చిన కొత్త జాతి జీవి.. ఎక్కడో తెలుసా!
ఐజ్వాల్: అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతి బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్‌లో తొలిసారిగా మిజోరంలో గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి గెక్కో మిజోరమెన్సిస్ అని పేరు పెట్టారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యేకత. 20 సెం.మీ. పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంది. ‘వీటి డీఎన్ఏ 21 శాతం వేరుగా ఉంది. ఇది నిజంగా కొత్త జాతి’ అని మిజోరం వర్సిటీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలజీ పరిశోధకులు తెలిపారు. మిజోరం ప్రజలు వీటిని అత్యంత ఖరీదైనవిగా భావించి వేటాడుతున్నారట. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్సిస్కు దగ్గరి పోలికలున్నాయట. ప్రపంచంలో గెకో జెనస్ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయి. వాటిలో చాలా రకాలు దక్షిణాసియాలో కనిపిస్తాయి. చదవండి: ఆర్బీఐ కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం -
ఆ గుండె వయసు.. 38 కోట్ల సంవత్సరాలు!!
వందలు, వేలు కాదు...ఏకంగా 38 కోట్ల సంవత్సరాల కిందటి నాటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్ ఫార్మేషన్’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది. దీంతోపాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్‌లోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. గోగో చేప.. ఊహాత్మక చిత్రం ఇదీ చదవండి: కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు -
Traditional Chinese Medicines: చైనా మందులు మహా ప్రమాదం!
సంప్రదాయ వైద్యం ప్రపంచానికి కొత్తేం కాదు. ఆసియాలో అందునా.. చైనా సంప్రదాయ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ గిరాకీ ఉంది. ఈ తరుణంలో శాస్త్రీయ ఆధారాల్లేని ఈ మందుల గురించి భయంకరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ శాస్త్రీయతను విస్మరిస్తోందని, భద్రతా పరమైన సందేహాలకు ఇది తావిస్తోందని తాజాగా కొన్ని పరిశోధనలు బయటపెట్టాయి. న్యూయార్క్ స్టానీ బ్రూక్ యూనివర్సిటీలోని క్యాన్సర్ రీసెర్చర్ ఆర్థర్ గ్రోల్మన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. టీఎంసీ(Traditional Chinese Medicines)లో Aristolochic అనే యాసిడ్ ఉంటుందని, ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వెల్లడించారు. ‘సేఫ్టీ కన్సర్న్స్ ఆఫ్ ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ ఇంజెక్షన్స్ యూజ్డ్ ఇన్ చైనీస్’ పేరిట ఆ రీసెర్చ్ నివేదిక వెలువడింది. ముఖ్యంగా టీసీఎం ఇంజెక్షన్లు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు రీసెర్చర్లు. క్లినికల్ ట్రయల్స్ లేకుండా, పక్షపాతమైన ధోరణిలో పరిశోధనతో వాటికి అనుమతి దొరుకుతోందని, ముఖ్యంగా పిల్లలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. టీసీఎం ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు.. చైనాతో పాటు నైజీరియా, టాంజానియా, సౌతాఫ్రికాలోనూ కేసులు నమోదు అవుతున్నాయని ఈ పరిశోధనలు గుర్తించాయి. హాంకాంగ్‌కు చెందిన మార్గరేట్ ఛాన్ 2006 నుంచి 2017 మధ్య డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. టీసీఎంకు జబ్బులను నయం చేసే కీలకమైన ప్రాధాన్యం ఉన్న మెడిసిన్లుగా గుర్తింపు ఇచ్చింది ఆమె. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇక చైనా సంప్రదాయ మందుల వ్యాపారం ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా నడుస్తోంది. 1972 తర్వాత అమెరికా సైతం చైనాతో ఒప్పందం చేసుకోవడంతో.. ఈ వ్యాపారం గ్లోబల్ మార్కెట్‌గా మారింది. అయితే సంప్రదాయ మందుల తయారీ పేరిట మూగ జీవాలను ముఖ్యంగా అడవి జంతువుల్ని అక్రమంగా వేటాడి చంపడంపై అభ్యంతరాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా ఆరోపణలనీ, అగ్రరాజ్యం కుట్ర అని రీసెర్చ్‌ను చైనా తోసిపుచ్చుతోంది. -
ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేశా: పూజా హెగ్డె
Pooja Hegde Recalls Her Role In Radhe Shyam Movie: ఈ సంక్రాంతికి సందడి చేస్తాయనుకున్న పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడి సినీ ప్రేక్షకులను, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ వాయిదా పడిన చిత్రాలలో డార్లింగ్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్' కూడా ఉంది. దీని తర్వాత మళ్లీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 'రాధేశ్యామ్' తాజా రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడిందో చెప్పింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డె. 'విభిన్నమైన లవ్ స్టోరీస్‌లలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రాధేశ్యామ్ సినిమాతో నా కల నెరవేరింది. రాధేశ్యామ్ చిత్రంలో ప్రేరణగా నటించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో హీరోయిన్ రోల్ అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో రాధేశ్యామ్ క్లిష్టమైనది. ఇది ఒక పీరియాడికల్ సినిమా కావడంతో ప్రేరణ పాత్రలో ఒదిగిపోయేందుకు ఎంతో రీసెర్చ్ చేశా.' అని పూజా హెగ్డె తెలిపింది. అభిమానులు, ప్రేక్షకులలాగే తాను కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఎదురుచూస్తున్నాని పేర్కొంది. -
అడుగేస్తేనే కరెంట్ పుడుతుంది మరి!
అడుగేస్తే మాస్, భూకంపం, దడదడా.. ఇలాంటి డైలాగులు అతిశయోక్తి కోసం సినిమాల్లో వాడుతుంటారు. కానీ, అడుగేస్తే నిజంగా కరెంట్పుడితే? ఎలా ఉంటుంది. ‘పవర్ వాక్’.. ఈ పదం ఎప్పుడైనా విని ఉన్నారా? స్విస్ సైంటిస్టుల చొరవతో త్వరలో ఇది నిజం కాబోతోంది. చెక్క ఫ్లోరింగ్, సిలికాన్ కలయిక ద్వారా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ ప్రారంభించే దిశగా ‘అడుగు’లు పడబోతున్నాయి. జూరిచ్(స్విట్జర్ల్యాండ్)కు చెందిన ఈటీహెచ్ జూరిచ్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ ప్రయోగాల్లో తొలి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. నానోజనరేటర్ పేరుతో తయారు చేసిన డివైజ్ ఆధారంగా లో వోల్టేజ్ కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగారు. నానో క్రిస్టల్స్‌ను పొందుపరిచిన చెక్కఫ్లోర్, దానికి సిలికాన్ కోటింగ్‌తో డివైజ్‌ను రూపొందించారు. ఈ డివైజ్‌పై అడుగువేయగానే ఒత్తిడి.. ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంట్‌తో ఎల్ఈడీ బల్బ్స్, చిన్న ఎలక్ట్రిక్ డివైజ్‌లను పని చేసేలా చేశారు. ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్.. అంటే ఎలక్ట్రాన్లను ఏ మెటీరియల్ అయితే కోల్పోతోందో అది ట్రైబో పాజిటివ్.. ఏదైనా పొందుతుందో అది ట్రైబో నెగెటివ్. ఈ సూత్రం ఆధారంగానే నానోజెనెరేటర్ పని చేస్తుంది. చెక్క ఫ్లోర్ ఎలక్ట్రాన్లను ఆకర్షించడం, వికర్షించడం.. మీద ఆధారపడి ఇది పని చేయనుంది. దీనిని మరింత మెరుగ్గా(మనిషికి ప్రమాదం జరగని స్థాయి) తీర్చిదిద్ది ఇంటి అవసరాలకు, తక్కువ స్పేస్‌లో ఉపయోగించనున్నట్లు ప్రొఫెసర్ గుయిడో పంజరసా చెబుతున్నారు. చదవండి: కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడే టూల్.. మనోడి సత్తా -
ఆ బ్లడ్ గ్రూపు వాళ్లు తస్మాత్ జాగ్రత్త!
బీజింగ్ : ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల కరోనా పాజటివ్ కేసులు నమోదు కాగా, అందులో 8 వేల మందికి పైగా మృతిచెందారు. రోజురోజుకు కరోనా మృతులు పెరుగుతున్న వేళ.. ఈ వైరస్‌కు సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా చైనాలో కరోనా సోకిన 2,000 మంది రక్త నమునాలను పరీక్షించగా.. బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నవారికి ఈ వైరస్ వల్ల ఎక్కువ హాని కలిగే అవకాశం ఉన్నట్టుగా తేలింది. వుహాన్ యూనివర్సిటీ జోంగ్నాన్ హాస్పిటల్‌లోని సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ విభాగానికి చెందిన జింగ్‌హువాన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. బ్లడ్ గ్రూపు ఏ కలిగినవారికి కరోనా వైరస్ సంక్రమణ రేటు అధికంగా ఉంటుందని, తీవ్రమైన లక్షణాలు కనబడతాయని పరిశోధకులు తెలిపారు. మరోవైపు బ్లడ్ గ్రూపు ఓ కలిగిన వారికి తేలికపాటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. బ్లడ్ గ్రూపు ఏ కలిగిన వ్యక్తులు కరోనా సంక్రమించకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ వారికి వైరస్ సోకితే ఎక్కువ నిఘాతో పాటు ఇతరులతో పోల్చితే మరింత మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. వుహాన్‌లో కరోనా బారినపడి మరణించిన 206 మందిలో బ్లడ్ గ్రూప్ ఏ కలిగినవారు 85 మంది, బ్లడ్ గ్రూప్ ఓ కలిగినవారు 52 మంది ఉన్నారని ఆ స్టడీలో పేర్కొన్నారు. ఈ పరిశోధనపై టియాంజిన్‌లోని స్టేట్ కీ లాబోరేటరీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ హెమటాలజీ పరిశోధరకుడు గావో యింగ్‌డాయ్ మాట్లాడుతూ.. ‘ఇందులో భయపడాల్సిన అవసరమేమి లేదు. బ్లడ్ గ్రూపు ఏ కలిగినవారికి 100 శాతం వైరస్ సంక్రమిస్తుందని దీని అర్థం కాదు. అలాగే బ్లడ్ గ్రూప్ ఓ కలిగినవారికి వైరస్ పూర్తిగా సురక్షితమని కూడా కాదు. ప్రతి ఒక్కరు అధికారులు చెప్పే జాగ్రత్తలు తీసుకుంటూ.. చేతులను ఎప్పటికీ శుభ్రపరుచుకుంటూ ఉండాలి’ అని తెలిపారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో ఇప్పటివరకు 151 మందికి సోకినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. చదవండి : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు సిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..! -
రోజుకి ఒక సిగరెట్ తాగినా..
లండన్ : రోజుకు కేవలం ఒక సిగరెట్ తాగినా గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ 50 శాతం పెరుగుతుందని, రోజుకు 20 సిగరెట్లు తాగే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు రెండితలవుతాయని, స్ట్రోక్ రిస్క్ నూరు శాతం పెరుగుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఇక మహిళలు రోజుకు ఒక సిగరెట్ తాగినా వారికి గుండె జబ్బుల రిస్క్ రెండు రెట్లు అధికమని తేల్చింది. దాదాపు 140 శాస్ర్తీయ అథ్యయనాలను విశ్లేషించిన అనంతరం గుండె జబ్బులకు స్మోకింగ్ ఎంతమాత్రం క్షేమకరం కాదని పరిశోధనకు నేతృత్వం వహించిన లండన్‌కు చెందిన యూసీఎల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ అల్లన్ హక్షా పేర్కొన్నారు. కార్డియోవాస్కులర్ జబ్బుల రిస్క్‌ను తప్పించుకునేందుకు సిగరెట్ల సంఖ్యను కుదించడం కాకుండా మొత్తంగా స్మోకింగ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచించారు. రోజుకు ఒక సిగరెట్ తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొందరు భావిస్తారని అయితే అలాంటి వారికి లంగ్ క్యాన్సర్ ముప్పు ఎదురవుతుందని చెప్పారు. కొత్త సంవత్సరంలో చాలా మంది స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనల్లో ఉండే క్రమంలో తాజా అథ్యయనంతో స్మోకర్లు వెంటనే తమ అలవాటును మార్చుకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. -
జిల్లాలో 3,340 పంట కోత ప్రయోగాలు
ఖరీఫ్‌లో 13.22లక్షల మెట్రిక్క్ష టన్నుల ధాన్యం దిగుబడి రబీలో నూరు శాతం వెదజల్లు సాగును ప్రోత్సహిస్తాం వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ రాయవరం : ఖరీఫ్‌లో 2.20 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేపట్టగా 13.22 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ కేవీవీ ప్రసాద్ తెలిపారు. రాయవరం మండలం సోమేశ్వరంలో పంట కోత ప్రయోగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ ప్రసాద్ మాట్లాడుతూ 3,340 పంట కోత ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 549 పూర్తి చేశామన్నారు. ఎకరాకు 32 నుంచి 38 బస్తాల దిగుబడి వస్తుందన్నారు. ఇది పెరిగే అవకాశం ఉందన్నారు. రబీలో తక్కువ కాలపరిమితి పంటలైన ఎంటీయూ 3626 (బొండాలు), విజేత 1001, కాటన్ దొర సన్నాలు 1110 తదితర రకాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో అపరాల సాగు చేయడం లక్ష్యంకాగా, 50 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. రూ.24కోట్లు మంజూరైంది... ఆర్కేవీవై, ఎస్ఎంఏఎం, ఎస్ఏపీ తదితర పథకాల ద్వారా అన్ని రకాల యాంత్రికీకరణ పనిముట్లు రైతులకు అందజేసేందుకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 24 కోట్లు మంజూరైందన్నారు. మెట్ట ప్రాంతమైన తుని, తొండంగి, జగ్గంపేట, ఏలేశ్వరం, కోరుకొండ తదితర 10 క్లస్టర్లలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసినట్లు తెలిపారు. సమావేశంలో చీఫ్ ప్లానింగ్ కార్యాలయం డీడీ ఎ.ఉదయభాస్కర్, ఎంఎస్‌వో గాయిత్రిదేవి, ఏవో ఎం.అరుణ ఉన్నారు. -
ఇప్పటికీ తప్పని జాతి వివక్ష
న్యూయార్క్: గాంధీజీని నల్లజాతీయుడైన కారణం చేత రైల్లోంచి దించేశారని చదివినప్పుడు ఆశ్చర్యపోయాం. ఆ రోజులు ఇప్పుడు లేవులే అని సరిపెట్టుకున్నాం. అయితే ఇప్పటికీ అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ నియామకాల్లో జాతివివక్ష కొనసాగుతూనే ఉందని న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇతర దేశాల నుంచి ఉద్యోగావకాశాల కోసం అమెరికాకు వెళ్లిన వారిలో తెల్లజాతీయులకు దక్కుతున్నన్ని అవకాశాలు, నల్లజాతీయులకు ఉండటం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా ఆసియా నుంచి వెళ్లిన వారు నల్లజాతీయులనే కారణం చేత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్న వారిలో ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారని, ప్రస్తుతం అమెరికా జనాభాలో వీరి సంఖ్య వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. పురుషులతో పోల్చుకుంటే నల్లజాతి మహిళలను మరింత చులకనగా చూస్తున్నట్టు వెల్లడైంది. ఉదాహరణకు లాటిన్ అమెరికా, ఆసియా ప్రాంతాల నుంచి వెళ్లిన మహిళల్లో అగ్రభాగం ఉద్యోగాలు లాటిన్ అమెరికా మహిళలకే వస్తున్నట్టు చెప్పారు. -
ఆన్లైన్ నవ్వు ఎన్ని విధాలు?
న్యూఢిల్లీ: నవ్వు నాలుగు విధాల చేటు అనేవాళ్లు, నవ్వు నాలుగు విధాల మంచిది అనేవాళ్లూ ఉన్నారు. ఈ వివాదాన్ని పక్కనే పెడితే ఆన్లైన్లో నవ్వు ఎన్ని విధాలు, ఎవరు ఎలా నవ్వుతారు? అనే ఆసక్తికరమైన అంశంపై ప్రముఖ సామాజిక వెబ్సైట్ 'ఫేస్బుక్' ఆధ్యయనం జరిపింది. నవ్వు నాలుగు విధాలేనని, కొంతమంది మాత్రమే బిగ్గరగా పగలబడి నవ్వుతారని (ఎల్ఓఎల్-లాఫింగ్ అవుట్ లౌడ్లీ), కొంతమంది హ హ్హహా... (హెచ్ఏహెచ్ఏ) అని నవ్వుతారని, మరికొంత మంది హెహ్హెహే... (హెచ్ఈహెచ్ఈ) అని నవ్వుతారని, ఇంకొంత మంది చిద్విలాసంగా (ఎమోజీ) నవ్వుతారని తేల్చింది. హహ్హహా...హెహ్హెహే అనే శీర్శికతో 'ది న్యూయార్కర్' అనే అమెరికా మేగజైన్లో వచ్చిన ఓ ఆర్టికల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆన్లైన్ మెటీరియల్‌పై ఎవరు, ఎలా నవ్వుకుంటారు? వారిలో ఎవరి శాతం ఎంత, ఏ వయస్సు వారు ఎలా నవ్వుతారు? అన్న అంశంపై ఫేస్బుక్ ఇటీవల సమగ్ర సర్వేను నిర్వహించింది. హ హ్హహా...నవ్వేవారు 51.4 శాతం మందని, హెహ్హెహే...అని నవ్వేవారు 13.1 శాతం మందని, చిద్విలాసంగా నవ్వేవారు 33.7 శాతం మందని, పగలబడి నవ్వేవారు కేవలం 1.9 శాతమని ఫేస్బుక్ సర్వేలో తేలింది. జెండర్, ఏజ్ పరంగా కూడా నవ్వుల్లో తేడాను గుర్తించింది. టీనేజర్లు ఎక్కువ మంది చిద్విలాసంగా నవ్వుతున్నారని, లేట్ ట్వెంటీస్లో ఉన్నవాళ్లు పగలబడి నవ్వుతున్నారని, పురుషుల్లో ఎక్కువ మంది హహ్హహా...అని నవ్వుతుంటే, మహిళలు హెహ్హెహే...అని నవ్వుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఇక ప్రాంతాల పరంగా చూస్తే ఫ్లోరిడాలో చిద్విలాసంగా నవ్వేవాళ్లు, పగలబడి నవ్వే వాళ్లు ఎక్కువ. అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో హెహ్హెహే...అని ఎక్కువ మంది నవ్వుతుండగా, ఓహాయో, వర్జీనీయా రాష్ట్రాల్లో హహ్హహా....అని ఎక్కువ మంది నవ్వుతున్నారు. ఫ్లోరిడా తర్వాత మధ్యప్రాచ్యంలో ఎక్కువ మంది చిద్విలాసంగా నవ్వుతుంటే, దక్షిణాది దేశాల్లో కూడా పగలబడి నవ్వుతున్నారు.