లండన్ : రోజుకు కేవలం ఒక సిగరెట్ తాగినా గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ 50 శాతం పెరుగుతుందని, రోజుకు 20 సిగరెట్లు తాగే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు రెండితలవుతాయని, స్ట్రోక్ రిస్క్ నూరు శాతం పెరుగుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఇక మహిళలు రోజుకు ఒక సిగరెట్ తాగినా వారికి గుండె జబ్బుల రిస్క్ రెండు రెట్లు అధికమని తేల్చింది. దాదాపు 140 శాస్ర్తీయ అథ్యయనాలను విశ్లేషించిన అనంతరం గుండె జబ్బులకు స్మోకింగ్ ఎంతమాత్రం క్షేమకరం కాదని పరిశోధనకు నేతృత్వం వహించిన లండన్‌కు చెందిన యూసీఎల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ అల్లన్ హక్‌షా పేర్కొన్నారు.
కార్డియోవాస్కులర్ జబ్బుల రిస్క్‌ను తప్పించుకునేందుకు సిగరెట్ల సంఖ్యను కుదించడం కాకుండా మొత్తంగా స్మోకింగ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచించారు. రోజుకు ఒక సిగరెట్ తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొందరు భావిస్తారని అయితే అలాంటి వారికి లంగ్ క్యాన్సర్ ముప్పు ఎదురవుతుందని చెప్పారు.
కొత్త సంవత్సరంలో చాలా మంది స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనల్లో ఉండే క్రమంలో తాజా అథ్యయనంతో స్మోకర్లు వెంటనే తమ అలవాటును మార్చుకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment