ధూమపానం అలవాటు ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చెడు అలవాటుకు బలైన ఎందరో జీవితాలు గురించి విన్నాం. అయినా ఫ్యాషన్ కోసం లేదా ట్రెండ్ అనో చదువుకున్న యువతే పొగకు బానిస్వవ్వుతున్నారు. మూడుపదుల వయసు దాటక మునుపే కాటికి వెళ్లిపోతున్నారు. పొగతో జీవితాలనే చేజేతులారా మసిచేసుకుని విలవిలలాడుతున్నారు. మసిబారిపోతామని తెలిసి ఆస్వాదిస్తున్నారంటే..జీవితమంటే నిర్లక్ష్యమా లేక అహంకారమా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఇదంతా ఎందుకంటే ఇక్కడొక మహిళ కూడా ఇలానే పొగకు బానిసై ఊపిరే భారమయ్యే సంకట స్థితిని ఎదుర్కొంది. చెప్పాలంటే చావుకి బతుకు మధ్య క్షణమో యుగంలా బతికింది. ఒక్కసారిగా జీవితం విలువ తెలసుకుని కన్నీళ్లు పెట్టింది. పొగబారిపోయిన జీవితాన్ని నయం చేసుకుని బతికిబట్టగలిగేందుకు మృత్యువుతో భయంకరంగా పోరాడింది. చివరికీ..
అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన జోర్డాన్ బ్రియెల్ అనే 32 ఏళ్ల మహిళకు యుక్త వయసు నుంచి ధూమపానం అలవాటు ఉంది. అయితే అది రాను రాను అలవాటుగా మారి ఎలక్ట్రానిక్ సిగరెట్‌లు(వాపింగ్) తాగేంత వరకు వచ్చింది. వాటికోసం ప్రతి వారం రూ. 40 వేల వరకు ఖర్చుపెట్టేది. జేబు చిల్లుపడేలా సిగరెట్లకే ఖర్చేపెట్టేసిది మొత్తం డబ్బంతా. దీంతో ఒక్కసారిగా ఆమె ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కి గురై ఆమె ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిపోయింది.
ఊపిరి సలపని దగ్గుతో నరకయాతన అనుభవించింది. ముక్కు నుంచి నోటి నుంచి ఒకవిధమైన నలుపు రంగు శ్లేష్మంతో ఉలుకు పలుకు లేని జీవచ్ఛవంలా అయిపోయింది. ఇక బ్రియెల్ బతకనేమో అనే స్థితికి వచ్చేసింది. ఊపరి పీల్చుకోవడమే అత్యంత భారంగ మనుగడ కష్టం అనేలా అయిపోయింది పరిస్థితి. అయితే వైద్యులు ఆమె ఊపిరితిత్తుల్లో ఉన్న రెండు లీటర్ల విషపూరిత ద్రవాన్ని తొలగించి నయమయ్యేలా చేశారు.
నెమ్మది నెమ్మదిగా కోలుకున్న బ్రియెల్ తాను మళ్లీ ఇలా బతికి బట్టకట్టగులుగుతానని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పొగ అంటేనే భయపడిపోయే స్థితికి వచ్చేసింది. అది తన జీవితాన్ని ఎంత నరకపాయంగా మార్చింది గుర్తుతెచ్చుకుని కన్నీటిపర్యంతమయ్యింది. వాపింగ్ అనే ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఎంత హానికరం అని చెప్పేందుకు బ్రియెల్ ఉదంతమే ఓ ఉదహరణ.
వాపింగ్ అంటే..
ఇక్కడ వాపింగ్ అంటే ద్రవ రుచిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు, పీల్చే ఏరోసోల్ ఏర్పడుతుంది. దీన్ని పీల్చుతూ అనందంపొందుతుంటారు పొగరాయళ్ళు. సిగరెట్‌లకు మంచి ప్రత్యామ్నాయంగా భావించి దీనికి అలవాటు పడుతున్నారు. వాస్తవానికి అనేక రసాయనాలను వాపింగ్‌లో ఉపయోగిస్తారు. వాటిని వేడి చేసినప్పుడు అవి చాలా విషపూరితంగా మారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.
ఈ వేప్‌లను వేడి చేసినప్పుడు, విషపూరిత రసాయనాలు వేగంగా లీక్ అవుతాయని, ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ఒక పరిశోధన వెల్లడించింది. అంతేగాదు దీనికి అలవాటు పడితే మాత్రం ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
(చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!)
Comments
Please login to add a commentAdd a comment