Heart disease problem
-
30 ఏళ్లకే గుండెపోటు.. కారణాలేంటి?.. ఇలా చేయకపోతే డేంజర్లో పడినట్టే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గం కూడేరుకు చెందిన వేణుగోపాల్ వయసు 35 ఏళ్లు. ఈయన వయసుకు మించిన బరువుతో ఉంటారు. ఈ మధ్యనే ఒక్కసారిగా గుండె పట్టేసింది. రాత్రికి రాత్రి 108 వాహనంలో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. హార్ట్ఎటాక్ అని చెప్పారు. తక్షణమే స్టెంట్ వేశారు. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో బతికి బయటపడ్డారు. చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో! గార్లదిన్నెకు చెందిన శ్రీనివాసులు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. సిగరెట్ తాగే అలవాటు ఉంది. అప్పుడప్పుడు మద్యం సేవిస్తారు. వాకింగ్, వ్యాయాయం వంటివి తెలియవు. ఉన్నట్టుండి ఈ మధ్యనే ఛాతిలో తీవ్రనొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించి యాంజియో నిర్వహించగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రెండు వాల్వులు పూడుకుపోయాయని వైద్యులు తెలిపారు. రెండు స్టెంట్లు వేసిన తర్వాత కోలుకున్నారు. పైన చెప్పినవి మచ్చుకు రెండు ఉదాహరణలే. వ్యాయామం, ఆహార నియమాలు పట్టించుకోని వారికి ఈ ప్రతికూలతలు ముప్పై ఏళ్లకే చూపిస్తుండటం కలవరపరుస్తున్న అంశాలు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీవన శైలిజబ్బులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ ఎగబాకుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్స్ట్రోక్ వంటి సమస్యలతో వస్తున్న వారిలో పట్టణ వాసులతో పాటు పల్లెటూరి వారూ ఉన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు సగటున నెలకు 500కు పైగా గుండెపోటు సమస్యలతో వస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో బ్రెయిన్‌స్ట్రోక్ సమస్యలతో వస్తున్న వారి సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఊబకాయం సమస్య కూడా పెరుగుతుండటంతో అధిక శాతం మంది రక్తపోటు, డయాబెటిక్ బారిన పడుతున్నారు. జబ్బుల శాతం పెరుగుతోంది జీవనశైలి జబ్బుల శాతం పెరుగుతోంది. ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు ఈ జబ్బులకు కారణమవుతున్నాయి. వ్యాయామ లేమితో ఎక్కువ మంది జబ్బుల బారిన పడుతున్నారు. ఈ మధ్య చాలా మంది మానసిక జబ్బులతో ఆస్పత్రి బాట పడుతున్నారు. – విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్ మిషన్ జీవనశైలిలో మార్పు రావాలి రోగాలకు దురంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం తమ జీవనశైలిలో మార్పులను అనుసరించాల్సిందే. ప్రధానంగా వ్యాయామం, యోగా, క్రీడలు వంటి వాటిలో ప్రాతినిధ్యం వహించాలి. ఒకే చోట ఉండి ఉద్యోగం చేయడం, శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రోజువారి 2000 వరకు ఓపీ సేవలు, 500 వరకు ఐపీ సేవలు అందిస్తున్నాం. – రఘునందన్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ -
సగం ధరకే స్టెంట్లు
సాక్షి, హైదరాబాద్: గుండెజబ్బుల చికిత్స కోసం ఉపయోగించే స్టెంట్లు మరింత చౌక కానున్నాయి. నికెల్, టైటానియం డయాక్సైడ్ల మిశ్రమంతో తయారైన సరికొత్త స్టెంట్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ శాఖ సంస్థ మిధాని (మిశ్ర ధాతు నిగమ్) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టెంట్ల ధరలో సగానికే కొత్తవి అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం వీటిని ఓ మెడికల్ యూనివర్సిటీ పరీక్షిస్తున్నట్లు మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ లేఖీ తెలిపారు. ‘షేప్ మెమరీ అల్లాయ్’గా పిలిచే ఈ కొత్త లోహ మిశ్రమాన్ని కొన్ని నెలల కిందే అభివృద్ధి చేశామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిన్నరలో ఈ కొత్త స్టెంట్ అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. స్టెయిన్లెస్ స్టీల్ కంటే ఎంతో మెరుగైన టైటానియం, ఇతర లోహాల తయారీలో ప్రఖ్యాతిగాంచిన మిధాని ఈ ఏడాది నుంచి బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెడుతోందని హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. కృత్రిమ పళ్లు బిగించేందుకు అవసరమైన స్క్రూ మొదలుకొని, కృత్రిమ కీళ్లు, భుజాలు, మోకాలు చిప్ప, తుంటి ఎముకలను తాము చాలా కాలంగా తయారు చేస్తున్నామని, ఇప్పటివరకు వాటి మార్కెటింగ్‌కు ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. హిందుస్తాన్ యాంటీ బయోటిక్స్ లిమిటెడ్‌తో బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పరీక్షలు అవసరం.. టైటానియం, నికెల్ స్టెంట్ల గురించి మాట్లాడుతూ వీటి సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించేందుకు విస్తృత స్థాయిలో వందల మందితో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. ఇందుకోసం మిలటరీ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు దినేశ్ లేఖీ చెప్పారు. ఈ పరీక్షలు తమ దేశంలోనే నిర్వహించాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కజకిస్తాన్ ప్రతిపాదించిందని, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్ ద్వారా రూ.100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీ నీరజా సరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
రోజుకి ఒక సిగరెట్ తాగినా..
లండన్ : రోజుకు కేవలం ఒక సిగరెట్ తాగినా గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ 50 శాతం పెరుగుతుందని, రోజుకు 20 సిగరెట్లు తాగే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు రెండితలవుతాయని, స్ట్రోక్ రిస్క్ నూరు శాతం పెరుగుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఇక మహిళలు రోజుకు ఒక సిగరెట్ తాగినా వారికి గుండె జబ్బుల రిస్క్ రెండు రెట్లు అధికమని తేల్చింది. దాదాపు 140 శాస్ర్తీయ అథ్యయనాలను విశ్లేషించిన అనంతరం గుండె జబ్బులకు స్మోకింగ్ ఎంతమాత్రం క్షేమకరం కాదని పరిశోధనకు నేతృత్వం వహించిన లండన్‌కు చెందిన యూసీఎల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ అల్లన్ హక్షా పేర్కొన్నారు. కార్డియోవాస్కులర్ జబ్బుల రిస్క్‌ను తప్పించుకునేందుకు సిగరెట్ల సంఖ్యను కుదించడం కాకుండా మొత్తంగా స్మోకింగ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచించారు. రోజుకు ఒక సిగరెట్ తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొందరు భావిస్తారని అయితే అలాంటి వారికి లంగ్ క్యాన్సర్ ముప్పు ఎదురవుతుందని చెప్పారు. కొత్త సంవత్సరంలో చాలా మంది స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనల్లో ఉండే క్రమంలో తాజా అథ్యయనంతో స్మోకర్లు వెంటనే తమ అలవాటును మార్చుకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. -
వైద్యుల ఆందోళన.. రోగుల నరకయాతన
వైద్యుడిపై కేసు తొలగించే వరకు నిరసన ఆగదు: వైద్యులు నిజామాబాద్ అర్బన్: పై చిత్రంలో రోది స్తున్న మహిళ పేరు లక్ష్మి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఈమె మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి గుండెజబ్బు సమస్యతో వచ్చింది. ఉదయం 9 గంటలకు ఓపీ విభాగంలో పేరు నమోదు చేసుకొని వెళ్లగా.. అక్కడ వైద్యులెవరూ లేరు. వారు విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నారు. వైద్యుల కోసం వేచి చూసిన లక్ష్మి నొప్పితో విలవిల్లాడుతూ ‘సారూ.. మమ్మల్ని చూడండి.. మీకు దండం పెడతా.. అని వైద్యులకు విలపిస్తూ విన్నవించింది. అయినా వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారు. ఉదయం 12 గంటల వరకు ఓపీ విభాగంలో 200 మంది పైగా రోగులు ఉన్నా వైద్యులు రాలేదు. గంటలతరబడి రోగులు వేచి చూసి వెళ్లిపోయారు. అత్యవసర చికిత్స కు వచ్చిన వారు కూడా అవస్థలు పడ్డారు. ఏం జరిగిందంటే.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ సోమవారం పాము కాటుకు గురయ్యా డు. బంధువులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపటికే మల్లేశ్ మృతి చెందాడు. అత్యవసర విభాగంలో ఉన్న వైద్యుడు నిర్లక్ష్యం వహించాడని స్ట్రైచర్ ఇవ్వలేదని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. తక్షణమే వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లగా.. ఆమె ఆదేశానుసారం ఆస్పత్రికి డీఆర్వో, ఆర్డీవో, డీఎస్పీ వచ్చి విచారణ జరిపి డాక్టర్ అరవింద్‌పై కేసు నమోదు చేశారు. అకారణంగా కేసు నమోదు చేశారని మంగళవారం ఆస్పత్రి వైద్యులు విధులు బహిష్కరించారు. మూడున్నర గంటల పాటు రోగులు వైద్యుల కోసం ప్రాధేయపడిన వైద్యులు పట్టించుకోలేదు.