చివరకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే ప్యాసివ్ స్మోకింగ్ దుష్ప్రభావాలతో ఆ పొగ తాలూకు దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిందే. అయితే భర్త ఇంటి బయటెక్కడో సిగరెట్ తాగి ఇంటికి వచ్చినా ఆ పొగ దుష్ప్రభావం దంపతులిద్దరితోపాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుందంటున్నారు పరిశోధకులు.
భర్తకి స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్‌నరైన భార్యకు గర్భధారణ బాగా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్ వల్ల భార్యలోని హార్మోన్ సైకిళ్లలోని జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. ఫలితంగా ఆమెలో అండాల సంఖ్య బాగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు.
మామూలు ఆరోగ్యవంతులైన దంపతులతో పోలిస్తే భర్తకు పొగతాగే అలవాటు ఉంటే... అతడి భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంతేకాదు... గర్భస్రావమయ్యే అవకాశాలూ పెరుగుతాయి. ఒకవేళ గర్భధారణ జరిగాక కూడా బిడ్డ నెలలు నిండకముందే పుట్టే (ప్రీమెచ్యుర్ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి.
అలా పుట్టే పిల్లల బరువు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశముంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక నేరుగా పొగతాగే పురుషుల విషయానికే వస్తే... ఆ దురలవాటు వల్ల వాళ్ల వీర్యంలోని శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా వారి సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది.
అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటుకు దూరంగా ఉండటమే మంచిది. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటమన్నది కేవలం సంతాన సాఫల్యం అనే ఒక్క విషయంలోనే కాకుండా పురుషుల సంపూర్ణ ఆరోగ్యంతో ΄ాటు, భవిష్యత్తులో వారి పిల్లల పూర్తి ఆరోగ్యానికీ అది మేలు చేస్తుంది.
(చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!)
Comments
Please login to add a commentAdd a comment