ఇది ప్రపంచంలోనే పొడవాటి రోడ్డు సొరంగం. ఆస్ట్రేలియాలోన సిడ్నీ నగరంలో ఉన్న ఈ సొరంగం పొడవు ఏకంగా 26 కిలోమీటర్లు. ఈ సొరంగ రహదారి పేరు ‘వెస్ట్ కనెక్స్’ ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం, న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఈ సొరంగ నిర్మాణం చేపట్టి, గత ఏడాది నవంబరు 26 నాటికి దీనిని పూర్తి చేశాయి.
ఉభయ ప్రభుత్వాలూ హోమ్‌బుష్–కింగ్స్‌గ్రోవ్‌ల మధ్య చేపట్టిన 33 కిలోమీటర్ల మోటారు రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మించాయి. ఈ రహదారి నిర్మాణం పనులు 2016 డిసెంబర్ 20న ప్రారంభించగా, సొరంగం సహా మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. దీని నిర్మాణానికి 4500 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల ఖర్చు (రూ.2.60 లక్షల కోట్లు) జరిగింది. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పొడవాటి సొరంగ రహదారిగా రికార్డులకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment