ఐజ్వాల్: అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతి బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్‌లో తొలిసారిగా మిజోరంలో గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి గెక్కో మిజోరమెన్సిస్ అని పేరు పెట్టారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యేకత. 20 సెం.మీ. పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంది. ‘వీటి డీఎన్‌ఏ 21 శాతం వేరుగా ఉంది.
ఇది నిజంగా కొత్త జాతి’ అని మిజోరం వర్సిటీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలజీ పరిశోధకులు తెలిపారు. మిజోరం ప్రజలు వీటిని అత్యంత ఖరీదైనవిగా భావించి వేటాడుతున్నారట. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్‌సిస్‌కు దగ్గరి పోలికలున్నాయట. ప్రపంచంలో గెకో జెనస్ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయి. వాటిలో చాలా రకాలు దక్షిణాసియాలో కనిపిస్తాయి.
చదవండి: ఆర్బీఐ కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం
Comments
Please login to add a commentAdd a comment