Lizards
-
ఎగిరొచ్చిన కొత్త జాతి జీవి.. ఎక్కడో తెలుసా!
ఐజ్వాల్: అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతి బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్‌లో తొలిసారిగా మిజోరంలో గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి గెక్కో మిజోరమెన్సిస్ అని పేరు పెట్టారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యేకత. 20 సెం.మీ. పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంది. ‘వీటి డీఎన్ఏ 21 శాతం వేరుగా ఉంది. ఇది నిజంగా కొత్త జాతి’ అని మిజోరం వర్సిటీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలజీ పరిశోధకులు తెలిపారు. మిజోరం ప్రజలు వీటిని అత్యంత ఖరీదైనవిగా భావించి వేటాడుతున్నారట. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్సిస్కు దగ్గరి పోలికలున్నాయట. ప్రపంచంలో గెకో జెనస్ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయి. వాటిలో చాలా రకాలు దక్షిణాసియాలో కనిపిస్తాయి. చదవండి: ఆర్బీఐ కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం -
బంగారంలో బప్పీ లహరిని మించిపోయాడు.. శరీరంపై 2 కిలోలు, కారు, బైక్ అన్నీ..
బప్పీలహిరి.. సంగీతమే కాదు.. ఆయన ఆహార్యమూ స్పెషలే.. ముఖ్యంగా బంగారం. అది తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన నమ్మకం.. ఈ చిత్రంలోని వియత్నాంవాసి ట్రాన్డక్లాయ్ అయితే.. దాన్ని మరింత ఎక్కువ నమ్ముతాడు.. అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా ఇలా గోల్డ్ ఉంచుకుంటాడు. అదొక్కటేనా.. తన కారు, బైక్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ చేయించేశాడు.. దాని వల్ల లోకల్‌గా పాపులర్ కూడా అయ్యాడు. ఇంత బంగారం ఉంది.. ఏం చేస్తాడు అనేదేగా మీ డౌట్.. వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.. వాటిని తెచ్చి.. అమ్మడమే మనోడి పని. చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి! -
మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం
సీతానగరం (పార్వతీపురం): మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో బల్లి కనిపించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యుల వివరణతో ఊపిరిపీల్చుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని గెంబలివారివీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే హెచ్ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, భోజన నిర్వాహకులు విద్యార్థులను భోజనం చేయనివ్వకుండా నిలువరించారు. ముందు జాగ్రత్తగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 27 మంది విద్యార్థులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఆస్పత్రిలో 2 గంటల సేపు వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించడంతో ఉపాధ్యాయులు, విద్యారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్వీ రమణ, ఆర్ఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ వీరబాబు పాఠశాలకు చేరుకుని వాకబు చేశారు. ఆస్పత్రి నుంచి పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటలకు టమాటా రైస్ వడ్డించారు. ఈ ఘటనపై తహసీల్దార్ మాట్లాడుతూ సాంబారులో బల్లిపడడం వాస్తవమేనని, ఉపాధ్యాయులు, నిర్వాహకులు అప్రమత్తం కావడంతో చిన్నారులకు ప్రమాదం తప్పిందన్నారు. -
సూపర్ మార్కెట్లోకి అనుకోని అతిథి.. జనం హడల్
బ్యాంకాక్: సాధారణంగా మనం సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అక్కడ ఏ బల్లో, పురుగో కనిపిస్తే భయపడి అక్కడి నుంచి పారిపోతుంటాం. అయితే ఎక్కడ నుంచి ప్రత్యక్షమయ్యిందో కానీ ఒక పెద్ద మానిటర్ బల్లి స్టోర్ లోపలికి వచ్చేసింది. దీన్ని చూసిన కస్టమర్లు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. అక్కడి సూపర్ మార్కెట్లో ఒక పెద్ద మానిటర్ బల్లి ప్రవేశించింది. ఇంతటితో ఆగకుండా.. స్టోర్‌లోని షేల్ఫ్లో అటు ఇటు తిరుగుతూ అక్కడి వస్తువులను కింద పడేసింది. కాసేపు అక్కడ గందర గోళ వాతావరణం ఏర్పడింది. అందరు భయంతో అరుస్తూ అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఆండ్రూ మాక్గ్రెగర్ అనే జర్నలిస్ట్ ట్వీటర్ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో..ఎంత భయంకరంగా ఉంది.. మీరేనా షాపింగ్ చేసేది.. పాపం దానిక్కుడా చేయాలనిపించిందేమో..అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
ఉడుము బిర్యానీ అదరహో!
సాక్షి, చెన్నై: లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో చాలామంది వంటిట్లో దూరి కొత్తకొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, నాన్‌వెజ్ బిర్యానీల పేర్లు ఇన్నాళ్లు విన్నాం. అయితే, కొందరు యువకులు ఏకంగా ఉడము బిర్యానీ తయారు చేసి అదరగొట్టారు. అంతే కాదు, టిక్ టాక్‌లో తమ కొత్త ప్రయత్నాన్ని వీడియో రూపంలో ఎక్కించి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఆ యువకులు తిరుచ్చి కేంద్ర కారాగారంలో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని సోలయాం పట్టి గ్రామానిక చెందిన యువకులు లాక్డౌన్ పుణ్యమా ఏకం అయ్యారు. ఎక్కడెక్కడ పనులు చేసుకుంటూ వచ్చిన మిత్రులు ఒక చోట చేరడంతో సందడి మొదలైంది. తమ గ్రామానికి కూత వేటు దూరంలో అడవులు ఉండడంతో ఈ మిత్ర బృందం బుధవారం బ్లాక్ మార్కెట్లో లభించిన మద్యం బాటిళ్లను తీసుకుని పరుగులు తీశారు. అడవుల్లోకి వెళ్తూ వంటా వార్పునకు కావాల్సిన వస్తువుల్ని పట్టుకెళ్లారు. మద్యానికి చిత్తైన ఈ బృందం తమకు కనిపించిన ఉడమును పట్టేశారు. దాన్ని కోసి పడేసి, శుభ్రం చేసి, బిర్యానీ తయారు చేసి ఆరగించారు. మద్యానికి చిత్తై మిత్రులు వేసిన చిందు, హంగామా అంతా ఇంతా కాదు. ఇంత వరకు బాగానే వీరి పార్టీ సాగినా, ఉడుమ బిర్యానీ ప్రయోగాన్ని వీడియో చిత్రీకరించిన మిత్ర బృందంలోని ఒకరు ఇంటికి రాగానే టిక్‌టాక్‌లోకి అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి చివరకు తిరుచ్చి అటవీ శాఖ అధికారుల కంట పడింది. ఇంకే ముంది పదుల సంఖ్యలో ఆ గ్రామంలోకి గురువారం వచ్చిన అటవీ అధికారులు ఆ మిత్ర బృందాన్ని తమ వలలో వేసుకున్నారు. ఏడుగురు తమ చేతికి చిక్కడంతో వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, తిరుచ్చి కేంద్ర కారాగారంలో ఊచలు లెక్కించేందుకు పంపించారు. -
పాములతో సావాసం..బల్లులతో భోజనం!
పాములు, కొండచిలువలు, బల్లులు, తేళ్లు.. వీటిని చూడగానే ఏమనిపిస్తుంది.. ఫస్ట్ భయం వేస్తుంది. కొందరికైతే వాటిని పుస్తకాల్లో బొమ్మలు చూడాలన్నా భయం, అసహ్యం అనిపిస్తుంది. మరి వాటితో కలసి భోజనం చేయాలంటే.. యాక్.. వామ్మో వాటిని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది భోజనం ఏంటి.. అసలు అన్నం తినకుండానైనా ఉంటాం కానీ.. అలాంటి తిక్క పనులు చేయమంటారా..? మీలాంటి వారి కోసం కాకుండా అవంటే ఇష్టం.. ప్రేమ ఉండే వారికోసం కంబోడియాలో ఓ రెస్టారెంట్ ఉంది. భోజనం చేయాలంటే అక్కడ ఉన్న కొండచిలువలు, పాములు, తేళ్లు వంటి సరీసృపాలతో కలసి కూర్చునే ధైర్యం కూడా కావాలి. ఎంచక్కా కొండచిలువను మెడలో వేసుకుని, టేబుల్‌పై పెట్టుకుని మన ఆర్డర్ ఆరగించొచ్చు. ప్రాణహాని ఉంటుందన్న భయం లేకుండా హోటల్ యజమానులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ రెస్టారెంట్ లోపల గాజు అద్దాల డబ్బాల్లో వీటిని పెట్టారు. అవంటే భయం ఉన్నవారు దూరం నుంచే వాటిని చూసుకుంటూ తినేయొచ్చు. మరీ ఇలాంటి రెస్టారెంట్లు అవసరమా అని ప్రశ్నిస్తే.. ఈ ప్రాణులను జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... అవి కూడా మంచివే.. ఊరికే ఎవరికీ హాని తలపెట్టవని చెప్పేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేశామని అంటున్నారు హోటల్ యజమానులు. -
బల్లి లొల్లికి...
గోడ మీద బల్లి కనిపించగానే గుండె గుభేల్మంటుంది చాలామందికి. ఎన్నిసార్లయినా తరమండి... మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి బల్లులు. వాటిని శాశ్వతంగా వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి. అవి పాటిస్తే సమస్య తీరిపోతుంది.బల్లులకి వెల్లుల్లి వాసన అంటే పరమ చిరాకు. అందుకే ఓ బాటిల్లో వేడి నీరు, దంచిన వెల్లుల్లి వేసి బల్లులు తిరిగే చోట స్ప్రే చేయాలి. ఇక అవి రానే రావు; గోడల మీద అక్కడక్కడా కోడిగుడ్డు గుల్లల్ని వేళ్లాడదీసి ఉంచితే రావు. అయితే రెండు వారాలకోసారి గుల్లల్ని మార్చాలి; ఫ్లై పేపర్స్ అని ఉంటాయి. వాటిని లైట్ల దగ్గర ఉంచితే బల్లులు వచ్చి అతుక్కుపోతాయి. అప్పుడు తీసుకెళ్లి బయట పారేయొచ్చు; కలరా ఉండలు కూడా బల్లుల్ని రాకుండా చేస్తాయి; నీటిలో మిరియాలను వేసి మరిగించి, ఆ నీటిని గోడల మీద చల్లితే బల్లులు రావు;కాఫీ పొడిని బల్లులు తిరిగేచోట చల్లితే మంచి ఫలితముంటుంది; ఉల్లిపాయలకీ బల్లులకీ అస్సలు పడదు. కాబట్టి ఉల్లిపాయ చక్రాల్ని గోడలకు వేళ్లాడదీయండి;నెమలి ఈకలంటే బల్లులకి చచ్చేంత భయం. కాబట్టి అక్కడక్కడా గోడలకు వాటిని అతికించండి;బల్లి కనిపించగానే ఒళ్లు జిల్లుమనిపించేంత చల్లని ఐస్ వాటర్‌ని దాని మీద స్ప్రే చేయాలి. ఇక అది కదల్లేదు. అప్పుడు వాటిని తీసుకెళ్లి బయట పారేయవచ్చు;