బల్లి లొల్లికి...
గోడ మీద బల్లి కనిపించగానే గుండె గుభేల్‌మంటుంది చాలామందికి. ఎన్నిసార్లయినా తరమండి... మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి బల్లులు. వాటిని శాశ్వతంగా వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి. అవి పాటిస్తే సమస్య తీరిపోతుంది.బల్లులకి వెల్లుల్లి వాసన అంటే పరమ చిరాకు. అందుకే ఓ బాటిల్లో వేడి నీరు, దంచిన వెల్లుల్లి వేసి బల్లులు తిరిగే చోట స్ప్రే చేయాలి. ఇక అవి రానే రావు; గోడల మీద అక్కడక్కడా కోడిగుడ్డు గుల్లల్ని వేళ్లాడదీసి ఉంచితే రావు. అయితే రెండు వారాలకోసారి గుల్లల్ని మార్చాలి; ఫ్లై పేపర్స్ అని ఉంటాయి. వాటిని లైట్ల దగ్గర ఉంచితే బల్లులు వచ్చి అతుక్కుపోతాయి. అప్పుడు తీసుకెళ్లి బయట పారేయొచ్చు;
కలరా ఉండలు కూడా బల్లుల్ని రాకుండా చేస్తాయి; నీటిలో మిరియాలను వేసి మరిగించి, ఆ నీటిని గోడల మీద చల్లితే బల్లులు రావు;కాఫీ పొడిని బల్లులు తిరిగేచోట చల్లితే మంచి ఫలితముంటుంది; ఉల్లిపాయలకీ బల్లులకీ అస్సలు పడదు. కాబట్టి ఉల్లిపాయ చక్రాల్ని గోడలకు వేళ్లాడదీయండి;నెమలి ఈకలంటే బల్లులకి చచ్చేంత భయం. కాబట్టి అక్కడక్కడా గోడలకు వాటిని అతికించండి;బల్లి కనిపించగానే ఒళ్లు జిల్లుమనిపించేంత చల్లని ఐస్ వాటర్‌ని దాని మీద స్ప్రే చేయాలి. ఇక అది కదల్లేదు. అప్పుడు వాటిని తీసుకెళ్లి బయట పారేయవచ్చు;