లండన్: బ్రిటన్ పోలీసులు నల్లజాతి చిన్నారుల పట్ల జాతి వివక్షతో వ్యవహరిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. తరచూ వారినే ఎక్కువగా దుస్తులు విప్పించి సోదాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘‘2018–2022 మధ్య ఇలా 3 వేల మంది పిల్లలను సోదాలు చేశారు. వీరిలో మూడొంతులు నల్లజాతి పిల్లలే. అంతా చూస్తుండగానే ఎనిమిదేళ్ల పిల్లలను కూడా బట్టలిప్పి తనిఖీలు చేయడం ఘోరం.
అమ్మాయిలను తనిఖీ చేసేటప్పుడు పురుష అధికారులు, అబ్బాయిలకైతే మహిళా అధికారులు ఉండటం మరీ శోచనీయం’’ అని చిల్డ్రన్స్ కమిషనర్ రాచెల్ డిసౌజా అన్నారు. ‘‘2020లో లండన్‌లోని ఓ స్కూల్‌లో 15 ఏళ్ల నల్లజాతి బాలికను డ్రగ్స్ ఉన్నాయంటూ మహిళా అధికారులు దుస్తులు విప్పి సోదాలు జరిపారు. ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దీనికి జాతి వివక్షే కారణమని భావిస్తున్నాం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment