strip clothes
-
దుస్తులు విప్పించి సోదాలు!
లండన్: బ్రిటన్ పోలీసులు నల్లజాతి చిన్నారుల పట్ల జాతి వివక్షతో వ్యవహరిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. తరచూ వారినే ఎక్కువగా దుస్తులు విప్పించి సోదాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘‘2018–2022 మధ్య ఇలా 3 వేల మంది పిల్లలను సోదాలు చేశారు. వీరిలో మూడొంతులు నల్లజాతి పిల్లలే. అంతా చూస్తుండగానే ఎనిమిదేళ్ల పిల్లలను కూడా బట్టలిప్పి తనిఖీలు చేయడం ఘోరం. అమ్మాయిలను తనిఖీ చేసేటప్పుడు పురుష అధికారులు, అబ్బాయిలకైతే మహిళా అధికారులు ఉండటం మరీ శోచనీయం’’ అని చిల్డ్రన్స్ కమిషనర్ రాచెల్ డిసౌజా అన్నారు. ‘‘2020లో లండన్లోని ఓ స్కూల్లో 15 ఏళ్ల నల్లజాతి బాలికను డ్రగ్స్ ఉన్నాయంటూ మహిళా అధికారులు దుస్తులు విప్పి సోదాలు జరిపారు. ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దీనికి జాతి వివక్షే కారణమని భావిస్తున్నాం’’ అని తెలిపారు. -
పర్వతపు అంచున నగ్నంగా ఫొటోలు.. అరెస్టు
కౌలాలంపూర్: పర్వతారోహణకు వెళ్లి శిఖరం అంచున నగ్నంగా ఫొటోలకు పోజులిస్తూ నిలుచున్న నలుగురు వ్యక్తులను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఇద్దరు కెనడియన్లు ఒక డచ్ వ్యక్తి మరోకరు బ్రిటన్కు చెందినవారు ఉన్నారు. మలేషియాకు చెందిన కినాబలు పర్వతాన్ని అక్కడ ప్రజలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవలె అక్కడ 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, తాము పవిత్రంగా చూసే ఆ పర్వతంపైకి అంతకుముందు టూర్ పేరిట వచ్చిన కొందరు అసభ్యకరంగా బట్టలు విప్పేసి తిరగడం, శిఖరాగ్రాన్ని చేరి ఫొటోలు తీసుకోవడంవంటివి చేయడం మూలంగా దాని పవిత్రత దెబ్బతిన్నదని అందుకే భూకంపం వచ్చిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ఇతర పర్యాటకులకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగించారని స్థానికులు ఆరోపణలు చేయడంతో పోలీసులు న్యూసెన్స్ కేసు కింద నలుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు టూరిస్టుల కోసం వెతుకుతున్నామని చెప్పారు.