అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓ వైపు సమయం దగ్గర పడుతుండటంతో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ విమర్శలు గుప్పించారు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె చేసిన తప్పిదాలకు హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓ ల్యాప్ టాప్ నుంచి పంపిన 65,000 ఈమెయిల్స్ ను హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పార్టీ సన్నిహితులు షేర్ చేసుకున్నారని ఎఫ్ బీఐ తన దర్యాప్తులో కనుగొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. స్వీయ తప్పిదాలకు హిల్లరీ ఒక్కరే ఇందులో బాధితురాలు కాదని, అమెరికన్ ప్రభుత్వ తీరుతో ప్రజలందరూ ఈమెయిల్స్ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.