ఎన్నికల ముందు హిల్లరీకి భారీ ఊరట
ఎన్నికల ముందు హిల్లరీకి భారీ ఊరట
Published Mon, Nov 7 2016 8:15 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌కు చిట్టచివరి నిమిషంలో భారీ ఊరట లభించింది. ఆమె గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా ప్రైవేటు ఈ మెయిల్ వాడారన్న విషయమై విచారణ పూర్తయిందని.. హిల్లరీపై తాము ఎలాంటి నేరారోపణలు చేయబోవడం లేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ తెలిపారు. దాంతో పోలింగ్‌కు మరొక్కరోజు ఉందనగా హిల్లరీకి ఇది భారీ ఊరటగా భావించవచ్చు. కాంగ్రెస్‌లోని కీలక సభ్యులకు ఈ మేరకు కామీ వర్తమానం పంపారు. మొత్తం ఈ మెయిళ్లను పరిశీలించేందుకు ఎఫ్‌బీఐ బృందం రోజుకు 24 గంటలూ పనిచేసిందని, చివరకు తాము జూలై నెలలో వ్యక్తపరిచిన అభిప్రాయంలో లెఆంటి మార్పు లేదని ఆయన అన్నారు. ప్రచారంలో చిట్టచివరిగా ముగిసిన 48 గంటల సమయంలో ఎఫ్‌బీఐ విచారణ లేకపోవడంపతో హిల్లరీ క్లింటన్‌కు ఇది మంచి ఆయుధంగా మారింది.
ఒకవేళ హిల్లరీ ఈ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడితే.. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఆమెతో కలిసి ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరారోపణలు మోపితేప తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య ఎలా కుదురుతుందోనన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. కానీ కామీ తాజా ప్రకటన పుణ్యమాని ఇప్పుడు ఇక ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పోయింది. ఇప్పుడు తాము సమర్పించింది మధ్యంతర నివేదిక ఏమీ కాదని, దర్యాప్తు మొత్తం పూర్తయిపోయినట్లేనని కూడా కామీ స్పష్టం చేయడంతో ఈ విషయంలో హిల్లరీ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి అక్టోబర్ 28వ తేదీన కామీ చేసిన ఒక ప్రకటనతో ఒక్కసారిగా డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యం పెరిగింది. అంతకుముందు వరకు ట్రంప్ మీద స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న హిల్లరీ క్లింటన్.. ఒక్కసారిగా కొంత వెనకబడ్డారు. ఒకానొక దశలో ట్రంప్ ఒకటి రెండు పాయింట్ల ఆధిక్యంలోకి కూడా వచ్చారు. ఇప్పుడు తాజాగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో హిల్లరీ మళ్లీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది.
Advertisement
Advertisement