క్వాంటికో తొలి ఎపిసోడ్కు కౌంట్డౌన్ | Priyanka Chopra Hollywood television series Quantico | Sakshi
Sakshi News home page

క్వాంటికో తొలి ఎపిసోడ్కు కౌంట్డౌన్

Published Sat, Sep 26 2015 2:15 PM | Last Updated on Mon, Oct 1 2018 5:16 PM

క్వాంటికో తొలి ఎపిసోడ్కు కౌంట్డౌన్ - Sakshi

బాలీవుడ్ సెలబ్రిటీలు హాలీవుడ్లో నటించటం కామన్ అయితే హాలీవుడ్ సీరియల్స్లో నటించటం మాత్రం చాలా అరుదు. గతంలో అనిల్ కపూర్ లాంటి స్టార్స్ హాలీవుడ్ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసినా పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయారు. అయితే ఈ హద్దులను చెరిపేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఇంగ్లీష్ టివి సీరియల్తో హల్చల్ చేస్తుంది.

సెప్టెంబర్ 27న ప్రారంభమవుతున్న క్వాంటికో టెలివిజన్ సీరీస్తో హాలీవుడ్ స్మాల్ స్క్రీన్ మీద సత్తాచాటడానికి రెడీ అవుతోంది ప్రియాంక. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్తో పాటు, ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సీరీస్ సక్సెస్ లో ప్రియాంక పాత్రే కీలకం అన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తన లుక్స్తో ఆకట్టుకున్న ప్రియాంక యాక్షన్ సీన్స్లోనూ అదే స్ధాయిలో నటించింది. ఈ సీరీస్ లో ఎఫ్బిఐ ఏజెంట్ గా నటిస్తుంది ప్రియాంక.

ఇక కథ విషయానికి వస్తే ఎఫ్బిఐలో రిక్రూట్ అయిన కొత్త మంది యువతి, యువకుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వర్జీనియాలోని క్వాంటికోలో ట్రైనింగ్ తీసుకున్న ఈ టీంలో ప్రతి ఒక్కరికి ఎఫ్బిఐలో చేరటం వెనుక ఓ ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ కథ ఏంటి ఎఫ్బిఐలో చేరిన ఈ టీం ట్రైనింగ్ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అన్నదే క్వాంటికో సీరిస్ కథ.

సెప్టెంబర్ 27 రాత్రి పది గంటలకు ఎబిసి ఛానల్ లో ఈ సీరిస్ తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అంతర్జాతీయ స్ధాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సీరిస్ టెలివిజన్ టిఆర్పీ చరిత్రలో సరికొత్త రికార్డ్లను సెట్ చేస్తుందని భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement