పెళ్లి వార్తలపై ప్రియాంక క్లారిటీ | Priyanka Chopra Clarity on Mangalsutra Bracelet | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 30 2018 7:20 PM | Last Updated on Mon, Apr 30 2018 7:29 PM

Priyanka Chopra Clarity on Mangalsutra Bracelet - Sakshi

ప్రియాంక చోప్రా

ముంబై : తాను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. మంగళసూత్రంలా ఉన్న బ్రాస్లెట్ ధరించడంతో ప్రియాంక రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే  కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ప్రియాంక ట్వీటర్‌ వేదికగా ఖండించారు. ‘‘హాహాహా.. నా పెళ్లిపై ఊహాగానాలు.. ఇది కేవలం దిష్టి తగలకుండా గాయ్స్‌..ఇక ఆపండి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చెబుతాను. రహస్యంగా ఏమి చేసుకోను’’ అని బ్రాస్లెట్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు.

‘క్వాంటికో’ సిరిస్‌తో హలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిచండం చాలా వరకూ తగ్గించేశారు. వరుస హలీవుడ్‌ చాన్స్‌లతో బిజీగా ఉన్న ప్రియాంకను అసోం ప్రభుత్వం రాష్ట్ర టూరీజం ప్రచారకర్తగా నియమించింది. ఈ సందర్భంగా అసోం పర్యాటక రంగంపై ప్రచారం చేయడానికి ప్రియాంక చాలా కాలం తర్వాత స్వదేశానికి వచ్చారు. ఈ ప్రయాణంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ప్రియాంక ధరించిన బ్రాస్లెట్.. చూడ్డానికి మంగళసూత్రంలా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ రహస్యంగా పెల్లి చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement