
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అహ్మదాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యాపారి ఉదంతం వెలుగుచూసింది. అహ్మదాబాద్‌లోని జడ్జీల బంగళా రోడ్డులోని రత్నం టవర్స్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణరంగ వ్యాపారి ధర్మేష్ షాను నిందితుడిగా గుర్తించారు. నిందితుడిపై మంగళవారం ఉదయం వస్త్రపూర్ పోలీస్ స్టేసన్‌లో ముగ్గురిని హతమార్చిన కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం..రూ 15 కోట్ల అప్పులతో ఇబ్బందిపడుతున్న షా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు.. సోమవారం రాత్రి ఘర్షణ జరగడంతో క్షణికావేశంలో భార్య, కుమార్తెలను కాల్చిచంపాడు. అనంతరం సోదరుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో పాటు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడతానని చెప్పాడు. ఇంతలోగా సోదరుడు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని డీసీపీ కేఎన్‌ఎల్ రావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment