ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే హజీ అలీం భార్య రెహానా (40) హత్యకు గురయ్యారు. తూర్పు ఢిల్లీలోని ఆమె ఇంట్లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు.
రెహానా హత్యకు గురైన సమయంలో హజీ అలీం ఇంట్లో లేరు. హజీ అలీం ప్రస్తుతం హజ్ యాత్రలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షాహ్ర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.