ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైసూరు(కర్ణాటక): తల్లిని తండ్రే హత్య చేయడం తాను చూశానని చిన్నారి కూతురు చెప్పిన సాక్ష్యంతో తండ్రికి శిక్ష పడింది. వివరాలు.. చామరాజనగర జిల్లా కోళిపాళ్య గ్రామానికి చెందిన తొళచనాయక్‌కు, పుష్పబాయికి పెళ్లి సమయంలో 20 గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఇచ్చారు. వీరికి 8 ఏళ్ల కూతురు ఉంది. తొళచనాయక్ తమ్మునికి సమస్య వస్తే డబ్బుల కోసం బంగారు నెక్లెస్‌ను కుదువ పెట్టాడు.
నెక్లెస్‌ను విడిపించుకురావాలని భార్య ఒత్తిడి చేసేది. 2017 మార్చి 27న ఇదే విషయమై గొడవ జరగ్గా తొళచనాయక్ వేటకొడవలితో భార్యను నరికి చంపాడు. ఈ కేసులో తుది విచారణ చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. తండ్రి దాష్టీకంపై కూతురు సాక్ష్యం చెప్పడంతో నేర నిరూపణ అయ్యింది. దోషికి జీవితఖైదును విధించారు.
Comments
Please login to add a commentAdd a comment