మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం! | Drunken Delhi man bludgeons wife, has sex with corpse | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం!

Published Sun, Jun 5 2016 3:20 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం! - Sakshi

మద్యం మత్తులో భార్య శవంతో శృంగారం!

న్యూఢిల్లీ: మద్యం మత్తులో ఓ 25 ఏళ్ల యువకుడు మృగాడిగా మారాడు. భార్యను ఇటుకతో కొట్టిచంపి.. ఆ తర్వాత ఆమె మృతదేహంతో లైంగిక కలాపాలకు పాల్పడ్డాడు. అనంతరం మద్యం మత్తులో శవం పక్కనే నిద్రపోయాడు.

గత నెల 30న పశ్చిమ ఢిల్లీలోని నిహాల్‌ విహార్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుడైన ప్రదీప్‌ శర్మను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ-రిక్షా డ్రైవర్‌ అయిన అతడు మద్యం మత్తులో భార్య మోనికాతో గొడవ పడ్డాడు. డబ్బు విషయమై భార్యాభర్తలు తరచూ గొడవపడేవారని, భార్యకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రదీప్‌ శర్మ అనుమానించేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గత నెల 30న రాత్రి సమయంలో ఇంటిఅద్దె చెల్లించకపోవడంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అప్పుడు మద్యం మత్తులో ఉన్న ప్రదీప్ శర్మ ఒళ్లుతెలియని ఆవేశంలో ఇటుకతో భార్యను కొట్టిచంపి.. ఆ తర్వాత మృతదేహంతో లైంగిక కలాపాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఉదయాన్ని జరిగిన దారుణాన్ని గుర్తించిన ప్రదీప్‌ తన ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి పరారయ్యాడని, యూపీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్న అతడిని పక్కా సమాచారం ప్రకారం అరెస్టు చేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement