సాక్షి, న్యూఢిల్లీ: క్లాస్‌మేట్‌పై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలతో నాలుగేళ్ల బాలుడిపై దేశ రాజధాని ఢిల్లీలో కేసు నమోదైంది. ఈ ఘటనలో పోలీసులు బాలుడిపై రేప్ కేసు నమోదుచేశారు. అయితే, ఏడేళ్ల లోపు బాలలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోరాదన్న నిబంధనల నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో న్యాయనిపుణులు సలహా కోరుతున్నారు.
ఢిల్లీలోని ద్వారాకకు చెందిన బాధిత బాలిక తల్లిదండ్రులు గత శుక్రవారం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తన ప్రైవేటు అంగాల్లో నొప్పి ఉందని తెలిపిందని, తన తరగతిలో ఒక బాలుడు తన దుస్తులు విప్పి.. ప్రైవేటు అంగాల్లో వేలు చొప్పించాడని, పెన్సిల్ షార్ప్ చేసి.. దానిని కూడా ఉపయోగించాడని బాలిక తెలిపినట్టు ఆమె తల్లి చెప్తున్నారు. బాలిక సోదరిగానీ, టీచర్ గానీ లేని సమయంలో అతను ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని, స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, టీచర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, దీనిపై స్కూల్ యాజమాన్యం సరైనవిధంగా స్పందించలేదని ఆమె పోలీసులకు తెలిపారు. వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించిన తర్వాతే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ఆచితూచి చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా నేరానికి బాధ్యత వహించడానికి కనీస వయస్సు ఏడేళ్లు ఉండాలని మన చట్టాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల బాలుడు నిందితుడిగా ఉన్న ఈకేసులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై పోలీసులు న్యాయనిపుణులను ఆశ్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment