ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే రాజధాని నగరం అయిన విజయవాడలో అక్రమ ఆయుధాలు కలకలం రేపాయి. గతంలో సైన్యంలో పనిచేసిన రెహముద్దీన్ అనే వ్యక్తి ఆయుధాలతో సంచరిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రెండు నాటు తుపాకులు, పది తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఒకసారి ఇతడిని భార్య మీద హత్యాయత్నం చేసిన కేసులో అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా తన భార్యను చంపేందుకే ఇలా ఆయుధాలు తీసుకుని తిరుగుతున్నాడా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ఆయుధాలను అతడు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.
విజయవాడలో తుపాకుల కలకలం
Published Sat, Sep 20 2014 2:09 PM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement
Advertisement