country made pistol
-
ఉద్యోగం నుంచి తీసేశారని..బీపీఓ కంపెనీ హెడ్‌పై కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్ సింగ్ అనే వ్యక్తి గేట్రర్ నోయిడా సెక్టార్2లో ఎన్సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్‌లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్ సద్రూల్ ఇస్లాం అనూప్‌ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. ఐతే గత నెల అనూప్ మేనేజర్ సద్రూల్ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్ అంగీకరించ లేదు. దీంతో అనూప్ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్ దేశీయ తుపాకీతో మేనేజర్ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్ సద్రూల్ని హుటాహుటినా కైలాష్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
విజయవాడలో తుపాకుల కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే రాజధాని నగరం అయిన విజయవాడలో అక్రమ ఆయుధాలు కలకలం రేపాయి. గతంలో సైన్యంలో పనిచేసిన రెహముద్దీన్ అనే వ్యక్తి ఆయుధాలతో సంచరిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రెండు నాటు తుపాకులు, పది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఒకసారి ఇతడిని భార్య మీద హత్యాయత్నం చేసిన కేసులో అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా తన భార్యను చంపేందుకే ఇలా ఆయుధాలు తీసుకుని తిరుగుతున్నాడా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ఆయుధాలను అతడు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.