
ప్రియురాలి కోసం భార్యను చంపాడు
హైదరాబాద్: ప్రియురాలి కోసం భార్యను హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని నార్సింగ్ లో రెండు నెలలు క్రితం భార్యను చంపిన భర్త శవాన్ని పూడ్చిపెట్టాడు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి నిందితుడిని విచారించిన అనంతరం శవాన్ని వెలికితీయనున్నట్లు పోలీసులు తెలిపారు.