narsingh
-
రాబరీ నేపథ్యంలో జీరో బడ్జెట్ మూవీ
కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1134’. శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వంలో రాంధుని క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు నందు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నేను, శరత్ చంద్ర ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కులదైవం వంటి వారు. వాళ్లే జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. ఇప్పుడు శరత్ తీసిన జీరో బడ్జెట్ సినిమా ‘1134’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కుంభకోణాలను ఈ మూవీలో చూపించాను’’ అన్నారు శరత్ చంద్ర తడిమేటి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మురళి కార్తికేయ, కెమెరా: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి. -
ఔటర్ రింగ్ రోడ్డులో రెచ్చిపోయిన హిజ్రాలు
-
నర్సింగ్ ఇంటర్న్షిప్కూ రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నర్సింగ్ కోర్సులో భాగంగా ఉన్న ఆరునెలల ఇంటర్న్‌షిప్‌కు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడున్నరేళ్ల ఈ కోర్సులో ఇంటర్న్‌షిప్ మినహా మిగతా మూడేళ్లకు మాత్రమే ఇప్పటివరకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఈ కోర్సు చేసే నేపథ్యంలో.. ఇంటర్న్‌షిప్ కాలానికి కూడా ‘ఫీజు’ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.5 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై శుక్రవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ ఆధ్వర్యంలో దీనిపై సమావేశం జరిగింది. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధా, ఎస్టీ సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ, ఈ శాఖల విభాగాధిపతులు, ఏపీ బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమోహన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కానీ ఏపీ ముఖ్యకార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొనలేకపోవడంతో సోమవారానికి దీనిపై చర్చ వాయిదా పడింది. అయితే ఫీజుల పథకం బకాయిలపై సూత్రప్రాయ చర్చ జరిగింది. పునర్విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ 58 శాతం, తెలంగాణ 42 శాతం భరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. -
ప్రియురాలి కోసం భార్యను చంపాడు
హైదరాబాద్: ప్రియురాలి కోసం భార్యను హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని నార్సింగ్ లో రెండు నెలలు క్రితం భార్యను చంపిన భర్త శవాన్ని పూడ్చిపెట్టాడు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి నిందితుడిని విచారించిన అనంతరం శవాన్ని వెలికితీయనున్నట్లు పోలీసులు తెలిపారు.