సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నర్సింగ్ కోర్సులో భాగంగా ఉన్న ఆరునెలల ఇంటర్న్‌షిప్‌కు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడున్నరేళ్ల ఈ కోర్సులో ఇంటర్న్‌షిప్ మినహా మిగతా మూడేళ్లకు మాత్రమే ఇప్పటివరకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఈ కోర్సు చేసే నేపథ్యంలో.. ఇంటర్న్‌షిప్ కాలానికి కూడా ‘ఫీజు’ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.5 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై శుక్రవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ ఆధ్వర్యంలో దీనిపై సమావేశం జరిగింది.
బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధా, ఎస్టీ సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ, ఈ శాఖల విభాగాధిపతులు, ఏపీ బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమోహన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కానీ ఏపీ ముఖ్యకార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొనలేకపోవడంతో సోమవారానికి దీనిపై చర్చ వాయిదా పడింది. అయితే ఫీజుల పథకం బకాయిలపై సూత్రప్రాయ చర్చ జరిగింది. పునర్విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ 58 శాతం, తెలంగాణ 42 శాతం భరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
నర్సింగ్ ఇంటర్న్‌షిప్‌కూ రీయింబర్స్‌మెంట్
Published Sat, May 30 2015 1:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement