
కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1134’. శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వంలో రాంధుని క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు నందు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నేను, శరత్ చంద్ర ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కులదైవం వంటి వారు.
వాళ్లే జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. ఇప్పుడు శరత్ తీసిన జీరో బడ్జెట్ సినిమా ‘1134’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కుంభకోణాలను ఈ మూవీలో చూపించాను’’ అన్నారు శరత్ చంద్ర తడిమేటి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మురళి కార్తికేయ, కెమెరా: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి.
Comments
Please login to add a commentAdd a comment