Gangadhar Reddy
-
రాబరీ నేపథ్యంలో జీరో బడ్జెట్ మూవీ
కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1134’. శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వంలో రాంధుని క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు నందు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నేను, శరత్ చంద్ర ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కులదైవం వంటి వారు. వాళ్లే జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. ఇప్పుడు శరత్ తీసిన జీరో బడ్జెట్ సినిమా ‘1134’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కుంభకోణాలను ఈ మూవీలో చూపించాను’’ అన్నారు శరత్ చంద్ర తడిమేటి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మురళి కార్తికేయ, కెమెరా: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి. -
వాంగ్మూలం వెనుక వేధింపులు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనేందుకు తాజా ఉదంతమే మరో ఉదాహరణ. నిజానిజాలు తెలుసుకోకుండా బురద చల్లడమే లక్ష్యంగా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతానికి ఇది మరో తార్కాణం. కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం పేరిట సీబీఐ ఆడిన డ్రామా బెడిసికొట్టింది. సీఐ శంకరయ్య, డీఎస్పీ వాసుదేవన్ చెప్పని విషయాలను వారి వాంగ్మూలాల పేరిట మీడియాలో ప్రచారం చేయాలన్న ఎత్తుగడలు విఫలం కావడంతో అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం పేరిట తాజాగా మరో లీక్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. వాస్తవం ఏమిటంటే... వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నట్లు కల్లూరు గంగాధర్‌రెడ్డి గత ఏడాది నవంబర్ 29న అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని కోరుతూ సీబీఐ అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. గంగాధర్‌రెడ్డి ఫిర్యాదులో ప్రధానాంశాలు ఇవీ.. ► టీడీపీ హయాంలో సిట్ బృందం సభ్యుడిగా ఉన్న సీఐ శ్రీరామ్ గతంలో నన్ను కడప డీటీసీకి పిలిచి చిత్ర హింసలు పెట్టారు. వైఎస్ వివేకాను హత్య చేయాలని శివశంకర్‌రెడ్డి నన్ను సంప్రదించినట్లుగా ఒప్పుకోవాలని వేధించారు. ► సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా అవే ఒత్తిళ్లు వచ్చాయి. వైఎస్ వివేకాను హత్య చేసినట్లుగా ఒప్పుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని డి.శివశంకర్‌రెడ్డి చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ అధికారులు వేధిస్తున్నారు. ► డి.శివశంకర్‌రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే వైఎస్ వివేకా హత్య జరిగినట్లు వాంగ్మూలంలో పేర్కొనాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ నాపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 2021 అక్టోబరు 2, 3వ తేదీల్లో రామ్‌సింగ్ నాకు వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్లుగా చెప్పాలని ఆదేశించారు. ► వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత నన్ను సంప్రదించారు. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలా చేస్తే రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామన్నారు. ► సీబీఐ అధికారులు నన్ను కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు తరలించి అప్పటికే రాసి ఉన్న వాంగ్మూలంపై సంతకం చేయాలని ఆదేశించారు. అదే వాంగ్మూలాన్ని తరువాత న్యాయస్థానంలో కూడా ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కానీ నాకు తెలియని విషయాలను తెలిసినట్లుగా చెప్పలేనని తిరస్కరించా. ► నాకు ప్రాణభయం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. విచిత్ర ప్రచారం... ► ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావటానికి సంబంధించి నేరాన్ని నాపై వేసుకుంటే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానని చెప్పాడు..’ కల్లూరు గంగాధర్‌రెడ్డి గత అక్టోబర్ 2న వాంగ్మూలం ఇచ్చినట్లు తాజాగా టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చిత్రహింసలు... ► ‘వైఎస్ వివేకా హత్య కేసును నాపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తామని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అన్నట్లుగా చెప్పాలని సీబీఐ నన్ను వేధిస్తోంది. ఆయనతోపాటు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని చెప్పాలని సీబీఐ అధికారులు చిత్ర హింసలు పెట్టారు...’ 2021 నవంబర్ 29న అనంతపురం పోలీసులకు కల్లూరు గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు -
వివేకా హత్యపై తప్పుడు వాంగ్మూలం ఇమ్మంటున్నారు
అనంతపురం క్రైం: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు వాంగ్మూలమివ్వాలని సీబీఐ అధికారులు, మరికొందరు ఒత్తిడి తెస్తున్నట్లు కల్లూరు గంగాధరరెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకాను హత్య చేయాలని ఆ కేసు నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనను కోరారని, ఇందుకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారని, ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని వాంగ్మూలమివ్వాలంటూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్, అప్పటి సిట్ సీఐ శ్రీరామ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత తీవ్ర ఒత్తిడి తెచ్చారని తెలిపాడు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గంగాధరరెడ్డి సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. చదవండి: హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలది కీలకపాత్ర: జర్నలిస్ట్ భరత్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. నాది కడప జిల్లా పులివెందుల. 12 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నా. పులివెందులలో డబుల్ మర్డర్ కేసులో ముద్దాయిని. వివేకానందరెడ్డిని హత్య చేయాలని నన్ను దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంప్రదించినట్లు చెప్పాలని అప్పట్లో సిట్ బృందంలో సీఐగా (ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర సీఐ) ఉన్న శ్రీరామ్ నాపై ఒత్తిడి తెచ్చారు. కడప డీటీసీలో చిత్ర హింసలు పెట్టారు. చేయని నేరాన్ని ఒప్పుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఈ ఏడాది అక్టోబర్ 2, 3 తేదీల్లో సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్టు చెప్పాలన్నారు. అక్టోబర్ 4న సీబీఐ అధికారులు యాడికిలోని మా ఇంటికి వచ్చారు. వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లి హత్య చేసి, దొంగతనం చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసి పారిపోవాలని శివశంకర్‌రెడ్డి నాతో చెప్పినట్లు చెప్పాలన్నారు. ఎవరైనా పట్టుకుంటే దొంగతనానికి వెళ్లానని, బీరువా శబ్దం విని వివేకానందరెడ్డి వచ్చినట్లు, ఏమి చేయాలో పాలుపోక హత్య చేశానని చెప్పమన్నారు. ఇందుకు శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానన్నట్లు వాంగ్మూలమివ్వాలని రామ్‌సింగ్ ఒత్తిడి చేశారు. చదవండి: సీబీఐ పిటిషన్లో టీడీపీ పలుకులు! కడప రింగ్ రోడ్డులో వైఎస్ సునీతను కలిశా ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఆరోగ్యం సరిగా లేక, అబద్ధాలు చెప్పేందుకు మనస్కరించక వెళ్లలేదు. తర్వాత కడప జిల్లా పెద్దకుడాలకు చెందిన బాబురెడ్డి యాడికికి వచ్చి నన్ను కలిశాడు. వైఎస్ సునీత నన్ను విచారణకు హాజరై సీబీఐ వాళ్లు కోరినట్లుగా వివేకాను శివ శంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారని చెప్పమన్నారని చెప్పాడు. ఇలా చెబితే రూ.10 లక్షలు ఇచ్చి, నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామని చెప్పారు. బాబురెడ్డి ముందస్తుగా రూ.15 వేలు ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమన్నాడు. నేను భయపడి ఈ నెల 25న కారు బాడుగకు తీసుకుని పులివెందులకు వెళ్లా. అక్కడ రింగ్ రోడ్డు వద్ద కారులో వేచి ఉన్న సునీతను కలిశా. సీబీఐ అధికారులు చెప్పమన్నట్లు సీబీఐ కోర్టు ముందు చెప్పమన్నారు. కడప సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ సీబీఐ వాళ్లు నన్ను కడప ఆర్ అండ్ బీ అతిథి గృహానికి తీసుకెళ్లారు. పైన చెప్పిన విధంగా వాంగ్మూలం తయారు చేసి నాకు చదివి విన్పించి, సంతకం చేయమన్నారు. చేయని తప్పుకు సంతకం చేయబోనని సీబీఐ వారితో గొడవపడ్డా. ఈ నెల 30న కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డు చేయాలని, అప్పుడు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు రెండు పేపర్లలో సమాధానాలు రాశిచ్చారు. దాన్ని తీసుకుని యాడికికి వచ్చేశా. అప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. వారు చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ హింసిస్తున్నారు. నా ఇంటి చుట్టుపక్కల కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ప్రాణ రక్షణ కల్పించాలి’ అని గంగాధర్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీఎస్పీతో విచారణ చేయిస్తున్నాం : ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప గుర్తు తెలియని వ్యక్తులు, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని కల్లూరు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో చేయని నేరానికి వాంగ్మూలం ఇవ్వాలని 2019లో అప్పటి సిట్ బృందంలోని సీఐ శ్రీరామ్, ఇటీవల సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. సీబీఐ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన వాట్సాప్ కాల్స్ స్క్రీన్‌షాట్‌ను జత చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణకు తాడిపత్రి డీఎస్పీ చైతన్యను నియమించాం. గంగాధర్‌రెడ్డిని వాచ్ చేయాలని పామిడి సీఐ, ఇతరులను ఆదేశించాం. -
సొంత అన్ననే చంపి .. ఇంట్లో పూడ్చిపెట్టాడు
ఆస్తి కోసం సొంత అన్నను కిరాతకంగా హతమార్చి ఇంట్లోనె పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వైఎస్సార్‌కడప జిల్లా సింహాద్రిపురం మండలం మిథునాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి(43), పెద్ది రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తికి సంబంధించిన విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పెద్దిరెడ్డి అన్నపై దాడి చేసి కర్రలతో చితకబాది హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనె పూడ్చి పెట్టాడు. గంగాధర్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
క(వ)లల పంట
సృష్టిలో ఎన్నో వింతలు, అద్భుతాలు. అందులో కవల పిల్లలూ ఓ భాగం. ముద్దులొలికే మోముతో అచ్చు గుద్దినట్లు ఇద్దరూ ఒకే రకంగా కనిపిస్తూ పలువురు కవలలు మనల్ని తికమక పెట్టడం పరిపాటి. చాలా మంది కవలలు ఇద్దరూ ఒకేలా ఉన్నప్పటికీ, కొందరిలో పోలికలు అంతగా కనిపించవు. ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి అయితే పోలికలు మరింత తక్కువగా ఉంటాయి. సినిమాల్లో చూపినట్లు ఇద్దరిలోనూ ఒకే లక్షణాలుండడం చాలా అరుదు. తల్లిదండ్రులకు మాత్రం వీరిని ఒకేసారి పెంచాల్సి రావడం కాస్తంత ఇబ్బందే. కవల పిల్లలు సమాజానికి చక్కటి కథా వస్తువుగా ఉపయోగపడుతున్నారు. అది రామాయణం (వాలి, సుగ్రీవుడు) మొదలు క్రికెట్ (స్టీవ్ వా, మార్క్ వా) దాకా. మొట్టమొదటి కవలల దినోత్సవం పోలెండ్‌లో 1976లో జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల కవలలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కవలల గురించి తెలియజేసే శాస్త్రాన్ని ‘జెమిలోలజీ’ అంటారు. - న్యూస్‌లైన్, అనంతపురం కల్చరల్ ఎవరు సన్నీ.. ఎవరు బన్నీ? వీరిద్దరిలో ఎవరు సన్నీ.. ఎవరు బన్నీ అని కనుక్కోవడం కొంచెం కష్టమే. ఇద్దరూ ఒకే పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నారు. ఆ తరగతి టీచర్లు సైతం వారిని గుర్తించడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారట. ఒకరు అల్లరి చేస్తే మరొకరికి దెబ్బలు కొట్టిన రోజులూ లేకపోలేదు. కదిరిలోని రైల్వేస్టేషన్ వీధిలో కాపురముంటున్న టీచర్ గంగాధర్‌రెడ్డి, రాణి దంపతుల కవల పిల్లలు శశిధర్‌రెడ్డి, మహిధర్‌రెడ్డి. వీరిని ముద్దుగా సన్నీ, బన్నీ అని పిలుస్తారు. ‘మొదట్లో మేము కూడా సన్నీ ఎవరో, బన్నీ ఎవరో గుర్తించడం కష్టంగా ఉండేది. ఇలాగైతే కాదని ఒకరి చేతికి నల్ల దారం, మరొకరికి ఎర్ర దారం కట్టాం. చుట్టుపక్కల వారు ఎవరు ఎవరో గుర్తుపట్టలేక సన్నీ, బన్నీ అంటూ రెండు పేర్లతో పిలుస్తుంటార’ని రాణి దంపతులు తెలిపారు. - న్యూస్‌లైన్, కదిరి