Phani
-
నా కెరీర్లో చేస్తున్న చాలెంజింగ్ క్యారెక్టర్ ‘ఫణి’: కేథరిన్ ట్రెసా
వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాకి ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కేథరిన్ ట్రెసా లీడ్ రోల్ చేస్తున్నారు. ఏయు–ఐ స్టూడియో పద్మనాభరెడ్డి సమర్పణలో ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్‌లో మీనాక్షి అనిపిండి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని డా. తోటకూర ప్రసాద్ విడుదల చేయగా, నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘కేథరిన్ లేకుంటే మా ‘ఫణి’ లేదు. ఆమె ధైర్యానికి అభినందనలు’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ– ‘‘ఫణి’ ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘నా కెరీర్లో చేస్తున్న చాలెంజింగ్ క్యారెక్టర్ ‘ఫణి’ సినిమాలోనిదే. ఓ మంచి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అని కేథరిన్ ట్రెసా చెప్పారు. -
కోడెల శివరామ్ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య
పట్నంబజారు: కోడెల శివరామ్ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తున్నారు. మేడికొండూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన కొల్లోజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్‌సెంటర్ డీమార్ట్‌లో గేట్ ఇన్చార్జిగా పనిలో చేరి సూపర్వైజర్గా ఎదిగాడు. కోడెల శివరామ్‌కు సంబంధించి వ్యక్తిగత పనులు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్లకు చెందినవి కూడా చూస్తుంటాడు. కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్ స్విచ్ఛాఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజమాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది. ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్ అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్ ఊరుకోరని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివరామ్, నాయక్‌లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్ వచ్చి, కోడెల శివరామ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
చనిపోయేవరకు నన్ను వదలవేమో.. ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్
జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే తన లైఫ్‌లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. బుల్లితెరపై కమెడియన్‌గా క్లిక్ అయిన సమయంలో అనారోగ్యానికి గురై షో నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. చాలాకాలం తర్వాత తాజాగా ఓ షోలో హాజరై తన కన్నీటి కష్టాలను వివరించాడు. ఆటోకు డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లేవాళ్లం 'ఒక పేరు వచ్చాక కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ 'మహాత్మ' సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది మేమే.. కానీ పాడింది మేమేనని ఎక్కడా పేరు వేయలేదు. అలా అక్కడ స్ట్రక్ అయిపోయాను. తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడు. అభి అన్న ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక.. హైపర్ ఆది అన్న, నేను కృష్ణా నగర్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ షేర్ ఆటోలో వెళ్లేవాళ్లం. ఆ దేవుడు నాపై కరుణ చూపలేదు జబర్దస్త్ షోలో మంచి పేరొచ్చింది. టీం లీడర్ స్థాయికి వెళ్లాను. కానీ ఎందుకో నామీద దేవుడు కరుణ చూపలేదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి కష్టాలే.. నేను చనిపోయేవరకు ఈ కష్టాలు నన్ను వదిలిపోవేమో అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్. అక్కడే ఉన్న ఫణి సైతం తాను పడ్డ బాధలను చెప్పుకొచ్చాడు. సినిమాలు చేద్దామని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. కానీ అక్కడ సినిమాల్లేవు. షోలు చేద్దామంటే అవి కూడా లేవు. ఆ సమయంలోనే నాన్నకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
రాబరీ నేపథ్యంలో జీరో బడ్జెట్ మూవీ
కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1134’. శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వంలో రాంధుని క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు నందు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నేను, శరత్ చంద్ర ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మాకు తరుణ్ భాస్కర్, అడివి శేష్ కులదైవం వంటి వారు. వాళ్లే జీరో బడ్జెట్ చిత్రాలను ప్రారంభించారు. ఇప్పుడు శరత్ తీసిన జీరో బడ్జెట్ సినిమా ‘1134’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కుంభకోణాలను ఈ మూవీలో చూపించాను’’ అన్నారు శరత్ చంద్ర తడిమేటి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ మురళి కార్తికేయ, కెమెరా: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి. -
సాహసానికి ‘స్పాట్’ అవార్డు
తెనాలి : నది వంతెనపై ఆగిన రైలు.. సాంకేతిక సమస్య తో ముందుకు కదలనంటోంది.. సమయం గడుస్తోంది.. వెనక వచ్చే మెమో రైళ్లు ఆగిపోతున్నాయి.. మరికొన్ని నిముషాల్లో వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లకూ బ్రేకులు అని వార్యమైన వేళ.. అసిస్టెంట్ లోకో పైలట్ డ్రైవర్ చేసిన సాహసం.. ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంది. దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ స్పాట్ అవార్డును గెలుచుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సీహెచ్‌వీపీ ఫణిబాబు రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా బెజవాడ డిపోలో చేస్తున్నారు. ఈ నెల 22న చెన్నై– న్యూఢిల్లీ (నం.12615) సూపర్‌ఫాస్ట్ రైల్లో డ్యూటీలో ఉన్నారు. చెన్నై నుంచి బయలుదేరిన ఆ రైలు, ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో ఆ రాత్రి 8.14 గంటలకు తడ–సూళ్లూరుపేట మధ్యలో నిలిచిపోయింది. అది కూడా సరిగ్గా కళింగి నది వంతెనపై. లోపాన్ని సరిదిద్ద డం సాధ్యపడలేదు. వాక్యూమ్ పోతోంది.. సంబంధిత బోగీ దిగువ నుండే ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయాలి.. కిందకు దిగడానికి అక్కడ ఎలాంటి సైడ్ పాత్ వే లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక గార్డు, సిబ్బంది నిస్సహాయంగా ఉండిపోయారు. పరిస్థితి గమనించిన రైలు డ్రైవర్(అసిస్టెంట్ లోకో పైలట్) సీహెచ్‌వీపీ ఫణిబా బు.. రైలు ఇంజన్‌లోంచి ఆ కోచ్‌కు వెళ్లి ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయడానికి సిద్ధపడ్డారు. బోగీ హ్యాండిల్స్, ఫుట్‌బోర్డు మెట్లను హత్తుకుని కిందకు వేలాడారు. ఏమాత్రం చేయి జారినా నదిలో పడిపోవడం ఖాయమని తెలిసినా.. భయప డలేదు. రైళ్లు ఆగిపోయి వేలాది ప్రయాణికులకు అసౌకర్యం కలగరాదన్న భావనతో తన విధి కాకున్నా ధైర్యం చేశారు. 15 నిమిషాల్లో ఐసోలేషన్ కాక్‌ను లాక్‌చేసి వ్యాక్యూమ్‌ను నిరోధించారు. దీంతో 9.05 గంటలకు జీటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని ఆరంభించింది. తర్వాత వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఎలాంటి అవరోధం లేకుండా చేయగలిగారు. ఫణిబాబు సాహసం తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం శివేంద్రమోహన్, సీనియర్ డీసీఈ కొండా శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ‘డీఆర్ఎం స్పాట్ అవార్డు’ను బుధవారం ప్రకటించారు. -
మాడుగుల నాగఫణి శర్మ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
అల్లకల్లోలంగా సముద్రం
-
పెను తుఫాన్‌గా మారిన ఫొని
-
సీఏ ఫైనల్లో మెరిసిన తెలుగుతేజం
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/గుంటూరు ఎడ్యుకేషన్: గత ఏడాది నవంబర్‌లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్షా ఫలితాల్లో తెలుగుతేజం మాదాటి ఫణీష్‌రెడ్డి సత్తాచాటాడు. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఫణీష్‌రెడ్డి దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్, జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫణీష్‌రెడ్డి ఆడిటర్ తుమ్మల రామ్మోహనరావు వద్ద ఆర్టికల్స్ చేస్తూ స్వతంత్రంగా పరీక్షకు సన్నద్ధమయ్యి ఈ ర్యాంకు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఫణీష్రెడ్డికి ఆడిటర్ అభినందనలు తెలిపారు. పెరిగిన ఉత్తీర్ణత.. ఒక గ్రూపుతో లేదా రెండు గ్రూపుల్లోనూ పరీక్షలకు హాజరైన 30,054 మంది విద్యార్థులకు గాను, 6,841 మంది ఉత్తీర్ణులై 22.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐసీఏఐ చరిత్రలోనే ఇది రికార్డుగా నిలిచింది. కాగా, సీఏ గ్రూప్–1, గ్రూప్–2 విభాగాలను కలుపుకొని దేశ వ్యాప్తంగా 9,479 మంది సీఏ కోర్సు పూర్తి చేశారు. గ్రూప్–1 విభాగంలో దేశవ్యాప్తంగా 39,328 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 6,257 మంది ఉత్తీర్ణులై 15.91 శాతం, గ్రూప్–2 విభాగంలో 39,753 మంది పరీక్షలు రాయగా వారిలో 6,006 ఉత్తీర్ణులు కాగా 15.11 శాతంగా నమోదైంది. గతేడాది జనవరిలో విడుదలైన సీఏ ఫైనల్ ఫలితాల్లో 11.57 శాతం ఉత్తీర్ణత నమోదవగా, ప్రస్తుతం దాదాపు రెట్టింపు శాతం నమోదైంది. జీఎస్టీ ప్రభావంతో దేశవ్యాప్తంగా సీఏలకు డిమాండ్ నెలకొన్న పరిస్థితుల్లో తాజా ఫలితాలు విద్యార్థులను సీఏ కోర్సు వైపు ఆకర్షితులను చేసే విధంగా ఉన్నాయని స్థానిక ఆడిటర్లతో పాటు శిక్షణ సంస్థలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... ‘‘నేను ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సా«ధించేందుకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న శ్రీనివాసరెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా చేస్తారు. అమ్మ శోభారాణి గృహిణి. నేను పదవ తరగతి చదువుతున్న సమయంలో సీఏ చేయాలనే నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పగా, వారు ఎంతో ప్రోత్సహించారు. ఐపీసీసీలో 71 శాతం, సీఏ సీపీటీలో 91 శాతం మార్కులు సాధించాను. ప్రస్తుతం ఆలిండియా స్థాయిలో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. సీపీటీ, ఐపీసీసీకి ఓ విద్యాసంస్థలో శిక్షణ తీసుకున్నా. సీఏ ఫైనల్స్ విషయంలో ఆర్టికల్స్ చేస్తూ సొంతంగా ప్రిపేర్ అయ్యాను’’. – ఫణీష్ రెడ్డి -
చిన్న చిత్రాలు మరిన్ని రావాలి
– అల్లు అరవింద్ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలు మరిన్ని రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో పదిమందికి పని దొరుకుతుంది. చిన్న సినిమాలు మంచి కథతో తీస్తున్నారు. శ్రేయాస్ శీను, ఫణిలకు సినిమా అంటే ప్యాషన్. చిన్న చిత్రాలు తీసి, సక్సెస్ సాధిస్తున్నారు’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, బాలీవుడ్ టీవీ నటి మహిమా మక్వాన్ జంటగా వేణును దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రేయాస్ శీను, ఫణి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. ఈ చిత్రం ట్రైలర్‌ను అల్లు అరవింద్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథను దర్శకుడు తనదైన స్కీన్ర్ప్లేతో ఎంటర్టైనింగ్గా చూపించబోతున్నారు. మా చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ చూసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రాహుల్, నిర్మాత ‘జెమిని’ కిరణ్, నటుడు–దర్శకుడు అవసరాల శ్రీనివాస్, దర్శకుడు ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్, సంగీతం: అచ్చు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తాళ్లూరి ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్: కె.అరుణ్ మోహన్. -
పంబలకడి జంబ సినిమా స్టిల్స్