![Director VN Aditya And OMG Productions Pan India film Phani Title launched](/styles/webp/s3/article_images/2024/10/3/vn-aditya.jpg.webp?itok=ru4s5GiB)
వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాకి ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కేథరిన్ ట్రెసా లీడ్ రోల్ చేస్తున్నారు. ఏయు–ఐ స్టూడియో పద్మనాభరెడ్డి సమర్పణలో ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్‌లో మీనాక్షి అనిపిండి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని డా. తోటకూర ప్రసాద్ విడుదల చేయగా, నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘కేథరిన్ లేకుంటే మా ‘ఫణి’ లేదు. ఆమె ధైర్యానికి అభినందనలు’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ– ‘‘ఫణి’ ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘నా కెరీర్‌లో చేస్తున్న చాలెంజింగ్ క్యారెక్టర్ ‘ఫణి’ సినిమాలోనిదే. ఓ మంచి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అని కేథరిన్ ట్రెసా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment