
మణికొండ: నగర శివారు నార్సింగిలో సంక్రాంతి పండగ తర్వాత నిర్వహించే పశు సంక్రాంతి (పశువుల జాతర)లో శుక్రవారం కొన్ని పాడి గేదెలు రూ.లక్షలు పలికాయి

గతంలో ఉన్న అత్యధిక రేటు రూ. 2.51 లక్షలను అధిగమించాయి

శేరిలింగంపల్లి మండలం నల్లగండ్లకు చెందిన మాధవరెడ్డి, వెంకట్‌రెడ్డి సోదరులు రూ. 4.5 లక్షలకు గుజరాత్‌కు చెందిన దులియా జాతి గేదెను కొనుగోలు చేశారు

నాగులపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ రూ.10 లక్షలకు నాలుగు దులియా జాతికి చెందిన గేదెలను కొనుగోలు చేశారు

షాబాద్ మండలం, సంకేపల్లిగూడకు చెందిన సాయికృష్ణారెడ్డి రూ.4.10 లక్షలకు రెండు దులియా జాతి గేదెలను కొనుగోలు చేశారు

ఇవి పూటకు 15 లీటర్ల నుంచి 25 లీటర్ల వరకు పాలు ఇస్తాయని రైతులు తెలిపారు

శుక్రవారం దాదాపు కోటి రూపాయల వరకు వ్యాపారం జరిగిందని, మార్కెట్ కమిటీకి రూ.లక్ష ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు











