ఏలూరు(ఫైర్‌స్టేషన్ సెంటర్) : కట్టుకున్న భార్య, అత్తపై పెట్రోలు పోసి నిప్పం టించిన వ్యక్తి ఘటనలో తాను గాయపడి ప్రాణభయంతో ఆస్పత్రిలో చేరినా చివరికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. ఏలూరు వన్‌టౌన్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు వంగాయగూడెం మహేశ్వర కాలనీకి చెందిన ఆరెట్ల సత్తమ్మ(65), ఆమె కుమార్తె తిరువీధుల లక్ష్మి(45)లు అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆది వారం తెల్లవారు జామున ఆస్పత్రిలో మృతిచెందారు. వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు భావి ంచారు. అయితే లక్ష్మి భర్త కైకలూరుకు చెందిన తిరువీధుల శివన్నారాయణ(48) కూడా కాలిన గాయాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శనివారం అర్ధరాత్రి చేరా డు. అతను ఇచ్చిన సమాచారంతో అసలు విషయం బయటపడింది.
ఆరెట్ల సత్తమ్మ, కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. కృష్ణ సోడాలు అమ్ముతుంటాడు. పెద్ద కుమార్తె లక్ష్మికి 12 సంవత్సరాల క్రితం శివన్నారాయణతో వివాహం అయ్యింది. మొదట్లో ఇద్దరు సంతోషంగానే ఉన్నా కాలక్రమంలో శివన్నారాయణ మద్యానికి బానిస కావడంతో లక్ష్మి ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే లక్ష్మి కి పుట్టింటి వద్ద వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని శివన్నారాయణ అనుమానించాడు. లక్ష్మి భర్త వద్దకు వెళ్లటం లేదని ఆమె తల్లి సత్తెమ్మ ఎన్నిసార్లు అడిగినా తల్లితో గొడవ పడేదే కానీ భర్త వద్దకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి తల్లీకూతుళ్లు ఘర్షణ పడి ఆత్మహత్యకు యత్నించి ఉంటారని భావించారు.
అనుమానం పెనుభూతమై..
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శివన్నారాయణ పథకం ప్రకారం తెచ్చుకున్న పెట్రోల్ త ల్లీకూతుళ్లపై పోసి నిప్పంటించాడు. ప్రమాద ఘటనగా చూపించే క్రమంలో భార్య, అత్తతో పాటు ఇంటిపైనా పెట్రోల్ పోసి ఆధారాలు లేకుండా చేసేం దుకు ప్రయత్నించాడు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో రెండు టిన్నులతో 16 లీటర్ల పెట్రోల్‌ను తెచ్చిన అతను ఒక టిన్నులోని పెట్రోల్‌ను భార్య, అత్త, ఇంటిపై పోసి నిప్పుపెట్టాడు. రెండో టిన్నును కాళ్ల వద్దే ఉంచుకోవటంతో అదికాస్తా పేలి తాను కూడా అగ్నికీలల్లో చిక్కుకుని గాయపడ్డాడు. ప్రయత్నం విఫలం కావడంతో గత్యంతరం లేక ఆసుపత్రిలో చేరి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
భార్య, అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
Published Mon, Jun 30 2014 12:52 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement