ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు | goons set fire to home in narsampet | Sakshi
Sakshi News home page

ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

Published Sun, Nov 27 2016 11:58 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

goons set fire to home in narsampet

వరంగల్: జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన అన్నసామి ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న పత్తి, ఫర్నీచర్, నగదు కాలి బూడిదయ్యాయి. 
 
ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. కాగా.. కొన్ని రోజుల క్రితం  గ్రామానికి చెందిన యాలాద్రి అనే వ్యక్తిని కొందరు కర్రలతో కొట్టి చంపారు. ఆ కేసులో అరెస్ట్ అయిన అన్నసామి ఇంటిని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement