
సాక్షి, నర్సంపేట : మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి వస్తున్న భార్యభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేసిన ఘటన నర్సంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన అంబటి వెంకన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. రోజు ఉదయాన్నే వెంకన్న తన భార్య విజయతో కలిసి వాకింగ్‌కు వెళుతుంటాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వెంకన్న కళ్లలో కారంపొడి చల్లి కత్తులతో దాడి చేసి పారిపోయారు. భార్య విజయ వెంటనే తీవ్రంగా గాయపడిన వెంకన్నను నర్సంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స నిర్వహించారు. కానీ వెంకన్న పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వరంగల్‌కు తరలించారు. కాగా, ఈ దాడికి భూవివాదమే కారణమై ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment