చోరీ కేసులో నలుగురి అరెస్ట్
Published Thu, Aug 4 2016 12:03 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
నర్సంపేట : డివిజన్ వ్యాప్తంగా పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సైలు బండ నారాయణరెడ్డి, హరికృష్ణ తెలిపారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని బస్టాండ్ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుం డగా తాళ్లపల్లి రాజు, వేమునూరి సుధాకర్, గుట్టోజు లింగాచారి, ఉల్లేరావుల రాహుల్‌లు తమను చూసి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఏడాదికాలంగా వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన ఆభరణాలను విక్రయించేందుకు వరంగల్‌కువెళ్తున్నట్లు తెలిపారు. ముగ్దుంపురంలో 12 గ్రాముల బంగారం, మల్లంపల్లిలో తులమున్న ర బంగారం, 20 తులాల వెండి, తులం బంగారు గొలుసు, ఉంగరాలు, రెండు బంగారు కమ్మలు, 20 తులాల వెండి గొలుసులు, మేడారంలో జాతరకు ముందు రెండున్నర తులాల బంగారం దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారన్నారు. నర్సంపేట పట్టణంలోని సంజయ్‌గాంధీ రోడ్‌లో రెండున్నర తు లాల గోపితాడు, తులమున్నర బం గారు మాటీలు, 15 తులాల పట్టగొలుసులు, పాపయ్యపేటలో తులం బంగారం, 10 తులాల వెండి, నర్సంపేట మండలంలోని రాజుపేటలో మూడున్నర తులాల బంగారం, 8 తులాల వెండిని సదరు నలుగురు వ్యక్తులు అపహరించినట్లు పేర్కొన్నారు. ఆ చోరీ సొత్తులో కొంత విక్రయించి రూ.30 వేలతో జల్సా చేశారన్నారు. ఆభరణాలను స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో ప్రొబేషనరీ ఎస్సై అశోక్, ఏఎస్సై కమలాకర్, సిబ్బంది మల్లేశ్, కుమార్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement