కళాశాలలో విద్యార్థుల ఘర్షణ: విద్యార్థి మృతిపై ఉద్రిక్తత | Warangal Student Dies Thrown From Narsampet BITS College Building | Sakshi
Sakshi News home page

Warangal BITS బిల్డింగ్‌పై నుంచి తోసేయడంతో విద్యార్థి మృతి

Published Sat, Sep 25 2021 11:01 AM | Last Updated on Sat, Sep 25 2021 1:52 PM

Warangal Student Dies Thrown From Narsampet BITS College Building - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ ​కాస్త ముదిరి ఒకరి ప్రాణం తీసింది. రెండో అంతస్తు నుంచి తోసేయడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఆ వివరాలు.. నర్సంపేట బిట్స్ కాలేజీలో నలుగురు విద్యార్థుల గొడవ ప్రారంభం అయ్యింది. చిన్న వాగ్వాదం కాస్త ముదిరి పెద్ద గొడవకు దారి తీసింది.
(చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్‌.. రక్షించండి సార్‌)

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. సంజయ్‌ అనే మరో విద్యార్థిని కాలేజ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి తోసేశారు. ఈ ప్రమాదంలో సంజయ్‎కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బిట్స్ కళాశాలలోని పాలిటెక్నిక్ చదువుతున్న సెకండియర్ విద్యార్ధి సంజయ్ మృతికి కళాశాల యాజమాన్యం కారణమంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. నర్సంపేట - వరంగల్ ప్రధాన రహదారి ధర్నా, రాస్తారోకో చేశారు. వారికి మద్దతుగా విద్యార్ధి సంఘాల నాయకులు కూర్చున్నారు. అయితే ధర్నా చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు.

చదవండి: వరంగల్‌ కుటుంబం హత్య: వదిన వల్లే అన్న మారాడని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement