-
వరంగల్ రూరల్ జిల్లాకు అనువైన ప్రదేశం
-
అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం
-
పట్టణంలోని వరంగల్ రోడ్డులో రాస్తారోకో
నర్సంపేట : వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేస్తే నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించి, కాకతీయలు నిర్మించిన సరస్సు పాకాల పేరును జిల్లాకు నామకరణం చేయాలని జేఏసీ డివిజన్ కన్వీనర్ అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గుంటి రాంచందర్ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాను రద్దు చేసి ప్రభుత్వం తెరపైకి వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేసుందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వరంగల్ జిల్లాలోనే నర్సంపేటను కొనసాగించాలని, ఒకవేళ వరంగల్ రూరల్ జిల్లాలో ప్రభుత్వం కొనసాగించాలనే ఆలోచనకు వస్తే వరంగల్ రూరల్ జిల్లాకు కేంద్రంగా నర్సంపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాలన్నారు. తప్పనిసరిగా నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలని అఖిలపక్షం ఏకపక్షంగా తీర్మానించినట్లు తెలిపారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు బంద్
నర్సంపేటను జిల్లా చేయాలని కోరుతూ పట్టణంలో అమరవీరుల స్థూపంవద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం పలు నినాదాలు చేశారు. ఈనెల 8న బంద్ ప్రకటించినట్లు అంబటి శ్రీనివాస్ తెలిపారు. అయినప్పటికీ నర్సంపేటకు నష్టం కలిగే విధంగా నిర్ణయాలు ఉంటే ఆమరణ నిరాహర దీక్ష చేపడుతామని తెలిపారు.
టీఆర్‌ఎస్, జేఏసీ నాయకుల మధ్య వాగ్వాదం
అఖిలపక్ష కమిటీ సమావేశంలో టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిపై జేఏసీ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడిన విధానంపై టీఆర్‌ఎస్ నాయకులు కామగోని శ్రీనివాస్ కల్పించుకొని అభ్యంతరం తెలుపుడంతో జేఏసీ నాయకులతో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో అందరూ సర్దుచెప్పి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కొనసాగించారు.
జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులు :
డాక్టర్ జగదీశ్వర్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి
నర్సంపేట నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రానికి చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్‌అన్నారు.
రాజకీయ లబ్ధికోసమే జిల్లాల విభజన :
నాడెం శాంతి కుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
జిల్లా పునర్విభజన ప్రజాభీష్టం మేరకే జరగాలే తప్ప రాజకీయ లబ్ధికోసం చేపట్టకూడదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్న పిల్లలకు చాక్లెట్లను పంచిన విధంగా జిల్లాల పంపిణీ చేపట్టడం స రైంది కాదన్నారు. జిల్లాలో ప్రజలను ఏకం చేసి వారి అభిష్టం మేరకే జిల్లా విభజన చేపట్టాల ని, రాజకీయ లబ్ధి కోసం చేపట్టకూడదన్నారు. జిల్లా ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ పూ ర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. జిల్లా కోసం అ ఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమన్నారు.
ప్రజల అభీష్టం మేరకు ముందుకు :
నాయిని నర్సయ్య, టీఆర్‌ఎస్ పట్టణ అ«ధ్యక్షుడు
ప్రజాభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు జరుగుతుందని, జిల్లా పునర్‌వ్యవస్థీకరణలో మా నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడన్నారు. భవిష్యత్తు కార్యాచరణను మా అధినాయకత్వంతో ప్రకటించి, వారి అభిప్రాయాల మేరకు ముందుకు సాగుతామన్నారు.
ప్రాతినిధ్యం తగ్గకుండా చూశారు :
రాంచందర్, నగర పంచాయతీ చైర్మన్
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అన్ని నియోజకవర్గా లు చీలిపోయాయని, మా నేత పెద్ది మాత్రం నర్సంపేట ను ఒకే జిల్లాలో కొనసాగే విధంగా కృషి చేశారన్నారు. ఒకవేళ రూరల్ జిల్లా తెరపైకి వస్తే ఖచ్చితంగా నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్ అన్నారు.
జిల్లా కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్దం :
ఎర్ర యాకుబ్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు
వరంగల్ జిల్లాలో నర్సంపేటను కొనసాగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, ఒకవేళ రూరల్ జిల్లాలోనే నర్సంపేటను కొనసాగించాలంటే మాత్రం నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కోసం అవసరమైతే ప్రా ణాలకైనా సిద్ధపడుతామన్నారు.