=విధివంచితులకు అందని సాయం
=దరఖాస్తు చేసుకున్న వారు 76 మంది
=పెండింగ్‌లో ఉన్నవి 41... నర్సంపేటలోనే అధికం
=ఏడాదిగా ప్రభుత్వ కార్యాలయూల చుట్టూ ప్రదక్షిణలు
=కనికరించని సర్కారు... అధికారులు
నర్సంపేట, న్యూస్‌లైన్: అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద చనిపోతే బాధితులకు సాయమందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపద్భందు పథకం జిల్లావాసులకు అందని ద్రాక్షగా మారుతోంది. పరిశీలన పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తుండడం... అధికారుల నిర్లక్ష్యం... ప్రజాప్రతినిధులు అలసత్వం వెరసి ఆపద్బంధు పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 76 వుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా... 29 వుందికే ఆర్థిక సాయం అందింది. ఆరు దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా... ఇంకా 41 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వ సాయం కోసం నర్సంపేట డివిజన్‌లో అత్యధికంగా 19 మంది బాధిత కుటుంబాలు ఏడాదిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయూలు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారుు.
తక్కువ నిధుల కేటారుయింపు
ఆపద్భందు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. లక్ష సాయుం అందించాలి. జిల్లాలో ఏటా 400 వుంది వరకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలోనే చాలా వరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. 40 నుంచి 50 వుందికి మాత్రమే ఇస్తున్నారు. ఆపద్బంధు కింద ప్రభుత్వ కేటారుయింపులు తక్కువగా ఉండడంతో వారు ఆ మేరకే సరిపుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన దరఖాస్తుదారులకు వురుసటి సంవత్సరం బడ్జెట్‌లో ఇస్తున్నావుని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా... జిల్లాలో అటువంటి ఛాయులు కనిపించడంలేదు.
సీఎం సహాయనిధికి మళ్లింపు
ఆపద్బంధు పథకం అవులులో చిత్తశుద్ధి లోపించడంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న విధివంచితులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసిన వారిని నిధుల కొరతతో సీఎం సహాయు నిధికి వుళ్లిస్తున్నారు. ఫలితంగా వారు ఆపద్భందు పథకానికి అర్హత కోల్పోతున్నారు. రూ. ఐదు వేల నావువూత్రపు సాయమందుతుండడంతో సదరు కుటుంబాలకు అవి ఏవిధంగా ఉపయోగపడడడం లేదు.
పత్తి ఏరుతూ కనిపిస్తున్న ఈ వృద్ధురాలు నల్లబెల్లి మండలం కొడైలుపల్లికి చెందిన ఒదెల సమ్మక్క ఆమె భర్త ఈ ఏడాది మే 17న జరిగినరోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు... ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరి కూతుళ్ల వివాహం కాగా... పెద్దకొడుకు వరంగల్‌లో టైలర్ పని నేర్చుకుంటున్నాడు. చిన్న కొడుకు ఆటో ట్రాలీ నడుపుతున్నాడు. భర్త చనిపోయిన నాటి నుంచి కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో రోజూ కూలికి పోతోంది. ఆమె ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ... ఇప్పటివరకు సాయమందలేదు. దీంతో సమ్మక్క వ్యక్తం చేసిన ఆవేదన ఆమె మాటల్లోనే...‘నా పెనిమిటి పోరుున తర్వాత విధి లేక రూ. 50 వేల అప్పు చేశా... ఆపద్బంధు పైసలు వస్తాయని చెబితే ఇన్నాళ్లు ధైర్యంగా ఉన్నా. అవి వత్త లేవు... ఇవి ఎట్లా తీర్చాలో తెలియడం లేదు.’