పలాస రైల్వేస్టేషన్ కౌంటర్ వద్ద ఉన్న మృతదేహం
శ్రీకాకుళం, కాశీబుగ్గ : మానవత్వం మంటగలిసే ఘటన పలాస రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెంది 15 గంటలు దాటినా ఎవరూ పట్టించుకోలేదు. మంగళవారం ఉదయం నుంచి మృతదేహం పడి ఉన్నా రైల్వే ఉద్యోగులు గానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు గానీ కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు రాత్రి 9 గంటల సమయంలో కొందరు ప్రయాణికులు స్పందించి రైల్వే పోలీసులకు, మాస్టర్‌కు సమాచారం అందించారు. అయినా వారు కూడా స్పందించకుండా అలాగే వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment