మృతదేహం పక్క నుంచే వెళ్లిపోతున్న తోటి ప్రయాణికులు
కాశీబుగ్గ :మానవత్వం మంటగలిసింది. కళ్ల ముందే ఓ వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నా పట్టించుకోకుండా ఎవరిదారిన వారే వెళ్లిపోయిన సంఘటన బుధవారం పలాస రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. విజయనగరం పట్టణంలోని వై.ఎస్.ఆర్.నగర్‌కు చెందిన గొట్టుపల్లి వెంకటరావు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పలాస రైల్వేష్టేన్‌లో టికెట్ తీసుకుని వెళ్తుండగా ఫుట్‌పాత్‌పై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గిలగిలా కొట్టుకుంటూ రక్షించాలని తోటి ప్రయాణికులను సాయమడిగినా ఎవరూ స్పందించలేదు.
దీంతో కొద్దిసేపటి తర్వాత వెంకటరావు మృతి చెందాడు. ప్రయాణికులు సకాలంలో స్పందించి కనీసం సపర్యలు చేసినా ప్రాణాలు దక్కేవని అక్కడే ఉన్న ఓ దివ్యాంగ యాచకుడు వాపోయాడు. వందలాది మంది ప్రయాణికులు చూస్తూ వెళ్లిపోయారే తప్ప వైద్యసేవల కోసం ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు మూడు గంటల తర్వాత జీఆర్‌పీ పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ దర్యాప్తు అధికారి జి.అరుణ్‌కుమార్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment