
సాక్షి, కాకినాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కాశీవారి పాకలు గ్రామానికి చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.
గత ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారన్న అక్కసుతో లోవలక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు.. తిరిగి బాధితులపైనే పోలీసు కేసులు పెట్టించారు. ఇటీవల ఏలేరు వరద పర్యటనలో భాగంగా ముంపు ప్రాంతాలకు వెళ్లిన వైఎస్ జగన్‌ను కలిసిన బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు.
దీంతో చలించిపోయిన వైఎస్ జగన్.. బాధితులకు ఆర్థిక సాయంతో పాటుగా వారి పక్షాన న్యాయ పోరాటం కోసం లీగల్ టీమ్ ఏర్పాటు చేశారు. బాధితులకు పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ వంగా గీతా చెక్కులు అందజేశారు.
ఇదీ చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’
Comments
Please login to add a commentAdd a comment