సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ జగనన్న | Prattipadu Constituency Of Kakinada District | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ జగనన్న

Published Fri, Nov 24 2023 1:08 PM | Last Updated on Fri, Nov 24 2023 1:38 PM

 Prattipadu Constituency Of Kakinada District - Sakshi

సాక్షి, కాకినాడ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజ్వరిల్లింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాది మంది జనం కదలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను బహిరంగ సభలో బడుగు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తుంటే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ.....

– 14 సంవత్సరాల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి. 
– ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు. వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో వైయస్సార్, నేడు జగనన్న.
– చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు 70 రూపాయలున్న పింఛన్‌ కనీసం 10 రూపాయలైనా పెంచాడా?
– చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్‌ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్న జగనన్న.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్‌. 
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్‌ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు.
– మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్‌ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు. 
– జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న. 
– రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు.
– రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 సంవత్సరాల్లో ఒక్కరినీ పంపని బాబు.
– నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన జగన్‌మోహన్‌రెడ్డి. సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ జగనన్న.
– ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన జగనన్న. బాబు కేవలం ముగ్గురికే ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారు. నలుగురు ఎస్సీ మంత్రుల్నీ కొనసాగిస్తున్న సీఎం జగన్‌.
– ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన జగన్‌.
– మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న.

మంత్రి మేరుగ  నాగార్జున మాట్లాడుతూ....

– అంబేద్కర్‌ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే, సాహూ మహరాజ్, పెరియార్‌ రామస్వామి నాయకర్, జగ్జీవన్‌రామ్ లాంటి వారు సామాజిక సాధికారత కోసం విప్లవాలు చేశారు. 
– ఏపీలోగానీ, భారతదేశంలోగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు వారి స్థితిగతుల కోసం ఆలోచించిన నాయకులు కరువయ్యారు. 
– ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు భరోసా, ధైర్యం వచ్చాయి. సమాజంలో అసమానతలు తొలిగాయి.
– రాజ్యాధికారం వచ్చేలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, డబ్బులు అందించి గుండెమీద చెయ్యి వేసుకొని పేదవారు బతకడానికి అవకాశాలు వచ్చాయి.
– మన పిల్లలు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ చదువుతున్నారు.
– 31 లక్షల పట్టాలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందుతున్నాయి.
– రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కింది.
–  ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు. బీసీ కులాల తోకలు కత్తిరిస్తాన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారన్నాడు.


– మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని బాబు. ఎస్టీ కమిషన్‌ ఇవ్వలేదు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేయించాడు.
– 2014లో మూడు పార్టీలు వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చాయి. ఒక్కటీ నెరవేర్చలేదు.
– చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. 
– పేదల కోసం, భావితరలాల భవిష్యత్‌ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. 
– 11.5 శాతం ఉండే పేదరికం 6 శాతానికి తగ్గిందంటే జగనన్న పేదల కోసం ఎంతగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. 
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న సీఎం కావడం అవసరం. 2024 ఎన్నికల్లో మనం తప్పు చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. 

ఎంపీ నందిగం సురేష్, మాట్లాడుతూ....

– జగనన్న తన పాదయాత్రలో మన కష్టాలు దగ్గర నుంచి చూశాడు.
– నాలుగున్నరేళ్లలో జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు.
– జగనన్నకు పేదవాడి గుండె తెలుసు. వ్యవసాయ కూలీల చమటవాసన తెలుసు. 
– మన జీవితాల్లో చీకటి నింపిన వ్యక్తి చంద్రబాబు. రెండెకరాల నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ సంపద మనదే. 
– నాడు–నేడు కింద స్కూళ్లు గొప్పగా ఉన్నాయంటే, అవ్వాతాతలు పింఛన్‌ తీసుకుంటున్నారంటే, వ్యవసాయ రైతులు బాగున్నారంటే జగనన్న కారణం.
– వాలంటీర్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. 
– మన జీవితాలకు వెలుగునిచ్చే వ్యక్తి జగనన్న. 20–25 ఏళ్లు సీఎంగా ఉంచుకోగలిగితే మన పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అవుతారు.
– చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకురాదు. వెన్నుపోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. 
– 2014లో మద్దతు పలికి 2019లో బాబును తిట్టిన పవన్‌ 2024లో మళ్లీ బాబు మంచోడంటున్నాడు.
– పేదవాళ్లు గొప్పవాళ్లు అవ్వాలని అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చిన జగనన్న.
– అమరావతిలో అసైన్డ్‌ భూములు దోచుకుతిన్న చంద్రబాబు.
– ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు నేనున్నానంటూ జగనన్న భరోసా ఇస్తున్నారు. 
– సామాన్యుడు పార్లమెంటులో కూర్చున్నాడంటే కారణం జగనన్న.

ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ....

– 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. 
– నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న.
– డైరెక్టర్‌ పదవులు వెతికి వెతికి బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అలాంటి ఆలోచన చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా. 
– నాలుగేళ్లలో రూ.7 లక్షల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్‌ ఉంటే రూ.4.15 లక్షల కోట్లు ఈ వర్గాలకే ఇచ్చారు. 
– లాంతరు పెట్టి వెతికినా గతంలో బడుగు వర్గాల్లో ఇంజనీరు, డాక్టరు కనిపించేవారు కాదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరు,డాక్టర్‌ ఉన్నారంటే కారణం వైయస్సార్‌.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తెచ్చి చదువుకొనే అవకాశం కల్పించారు.
– ఇంటి స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారు. రాజధానిలో సోషల్‌ డెమోగ్రఫీ చెడిపోతుందన్నారు. 
– 30 లక్షల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జగనన్న.
– మహిళలంటే పొలాల్లో కోతలకే, వంటింటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతి పథకాన్నీ మహిళ పేరు మీద పట్టా, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము తల్లి పేరుమీద ఖాతాలో వేస్తున్నారు. 
– గతంలో పార్టీ, కులం చూసేవారు. మనకు ఓటు వేస్తారా అని చూసేవారు. మన కులాలను బానిసలుగా భావించేవారు. 
– ఈరోజు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పని లేదు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.

ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ...
– జనం గుండెచప్పుడు జగనన్న.  కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారు. 
– వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న.
– దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోంది. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారు.
– 2014–19 మధ్య ఏ విధమైన సామాజిక న్యాయం చంద్రబాబు చేశారు? ఈరోజు ఏ విధమైన సామాజిక న్యాయం జరుగుతోందో చర్చకు సిద్ధం. 
– రూ.2.40 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేసి సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా జగనన్న ఉన్నారు. 
– ఏ ఎన్నికల్లో, ఏ పార్టీ మేనిఫెస్టోలో చూసినా జగనన్న పథకాలు కనిపిస్తాయి. 
– వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ల విధానం ఇస్తామని రాష్ట్రాలు చెబుతున్నాయి.
– బాబుకే గ్యారెంటీ లేదు. ఆయన ఇంకేం గ్యారెంటీ ఇస్తాడు. బాబు గ్యారెంటీల్లోనూ జగనన్న స్పూర్తి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement