Social Empowerment Mission
-
గెలిచేది వైఎస్సార్సీపీ జెండా.. నిలిచేది జగన్ అజెండా
సాక్షి విజయనగరం: జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. రుణాల మాపీపై బాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా ప్రజల కలలను సాకారం చేసారో ప్రజలు గమనిoచాలన్నారు. బొబ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. 25 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, వారిలో 17 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారని గుర్తు చేసారు. గడిచిన ఎన్నికలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ తీరుస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పింఛన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్థాయి సంపన్నుల పిల్లలు ఎలా చదువుకుంటారో, పేదల పిల్లలు కూడా అలానే అభ్యసించాలని ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారని వివరించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిత కోసం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని, బొబ్బిలి రాజుల పిల్లలే ఆంగ్లంలో చదువుకోవాలా, ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా అని జగన్ నాడు - నాడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బొబ్బిలిలో శంబంగి చిన అప్పల నాయుడును, రాష్ట్రంలో జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ముత్యాల నాయుడు ఉద్గాటించారు. జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 606 హామీలిచ్చి కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అర్హతలే ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని, కుల, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తున్నారని వెల్లడించారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనా ఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే, ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించారని విమర్శించారు. గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలిలో సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రజానీకాన్ని చస్తుంటే జన సునామీని తలపిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్నారని, వారిని చెప్పే మాయ మాటలను నమ్మవద్దని హితవు పలికారు. చెరకు రైతులను షుగర్ ఫ్యాక్టరీ నిలువునా ముంచేసి మోసం చేస్తే వైెఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు అందించామన్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల రూపు రేఖలు మారుస్తున్న ఘనత జగన్ దేనని కొనియాడారు. వెనుకబడిన వర్గాలన్నీ జగన్ సారథ్యంలో అథికారం అనుభవిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పనుల కోసం బొబ్బిలి రాజుల గేటు వద్ద కాపలా కాయాలని వివరించారు. తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులను ఆదుకున్నామని, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా అండగా ఉంటామన్నారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే సాధ్యం - ఎంపీ బెల్లాన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. -
సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న
సాక్షి, కాకినాడ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజ్వరిల్లింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాది మంది జనం కదలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను బహిరంగ సభలో బడుగు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తుంటే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ..... – 14 సంవత్సరాల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి. – ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు. వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో వైయస్సార్, నేడు జగనన్న. – చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు 70 రూపాయలున్న పింఛన్ కనీసం 10 రూపాయలైనా పెంచాడా? – చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్న జగనన్న. – ఫీజు రీయింబర్స్మెంట్ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్. – ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు. – మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు. – జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న. – రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. – రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 సంవత్సరాల్లో ఒక్కరినీ పంపని బాబు. – నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన జగన్మోహన్రెడ్డి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న. – ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన జగనన్న. బాబు కేవలం ముగ్గురికే ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారు. నలుగురు ఎస్సీ మంత్రుల్నీ కొనసాగిస్తున్న సీఎం జగన్. – ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన జగన్. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... – అంబేద్కర్ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, జగ్జీవన్‌రామ్ లాంటి వారు సామాజిక సాధికారత కోసం విప్లవాలు చేశారు. – ఏపీలోగానీ, భారతదేశంలోగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు వారి స్థితిగతుల కోసం ఆలోచించిన నాయకులు కరువయ్యారు. – ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు భరోసా, ధైర్యం వచ్చాయి. సమాజంలో అసమానతలు తొలిగాయి. – రాజ్యాధికారం వచ్చేలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, డబ్బులు అందించి గుండెమీద చెయ్యి వేసుకొని పేదవారు బతకడానికి అవకాశాలు వచ్చాయి. – మన పిల్లలు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ చదువుతున్నారు. – 31 లక్షల పట్టాలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందుతున్నాయి. – రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కింది. – ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు. బీసీ కులాల తోకలు కత్తిరిస్తాన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారన్నాడు. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని బాబు. ఎస్టీ కమిషన్ ఇవ్వలేదు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేయించాడు. – 2014లో మూడు పార్టీలు వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చాయి. ఒక్కటీ నెరవేర్చలేదు. – చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. – పేదల కోసం, భావితరలాల భవిష్యత్ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. – 11.5 శాతం ఉండే పేదరికం 6 శాతానికి తగ్గిందంటే జగనన్న పేదల కోసం ఎంతగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న సీఎం కావడం అవసరం. 2024 ఎన్నికల్లో మనం తప్పు చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. ఎంపీ నందిగం సురేష్, మాట్లాడుతూ.... – జగనన్న తన పాదయాత్రలో మన కష్టాలు దగ్గర నుంచి చూశాడు. – నాలుగున్నరేళ్లలో జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. – జగనన్నకు పేదవాడి గుండె తెలుసు. వ్యవసాయ కూలీల చమటవాసన తెలుసు. – మన జీవితాల్లో చీకటి నింపిన వ్యక్తి చంద్రబాబు. రెండెకరాల నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ సంపద మనదే. – నాడు–నేడు కింద స్కూళ్లు గొప్పగా ఉన్నాయంటే, అవ్వాతాతలు పింఛన్ తీసుకుంటున్నారంటే, వ్యవసాయ రైతులు బాగున్నారంటే జగనన్న కారణం. – వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. – మన జీవితాలకు వెలుగునిచ్చే వ్యక్తి జగనన్న. 20–25 ఏళ్లు సీఎంగా ఉంచుకోగలిగితే మన పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అవుతారు. – చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకురాదు. వెన్నుపోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. – 2014లో మద్దతు పలికి 2019లో బాబును తిట్టిన పవన్ 2024లో మళ్లీ బాబు మంచోడంటున్నాడు. – పేదవాళ్లు గొప్పవాళ్లు అవ్వాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిన జగనన్న. – అమరావతిలో అసైన్డ్ భూములు దోచుకుతిన్న చంద్రబాబు. – ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు నేనున్నానంటూ జగనన్న భరోసా ఇస్తున్నారు. – సామాన్యుడు పార్లమెంటులో కూర్చున్నాడంటే కారణం జగనన్న. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... – 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు కేబినెట్లో ఉన్నారు. – నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. – డైరెక్టర్ పదవులు వెతికి వెతికి బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అలాంటి ఆలోచన చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా. – నాలుగేళ్లలో రూ.7 లక్షల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఉంటే రూ.4.15 లక్షల కోట్లు ఈ వర్గాలకే ఇచ్చారు. – లాంతరు పెట్టి వెతికినా గతంలో బడుగు వర్గాల్లో ఇంజనీరు, డాక్టరు కనిపించేవారు కాదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరు,డాక్టర్ ఉన్నారంటే కారణం వైయస్సార్. – ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి చదువుకొనే అవకాశం కల్పించారు. – ఇంటి స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారు. రాజధానిలో సోషల్ డెమోగ్రఫీ చెడిపోతుందన్నారు. – 30 లక్షల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జగనన్న. – మహిళలంటే పొలాల్లో కోతలకే, వంటింటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతి పథకాన్నీ మహిళ పేరు మీద పట్టా, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము తల్లి పేరుమీద ఖాతాలో వేస్తున్నారు. – గతంలో పార్టీ, కులం చూసేవారు. మనకు ఓటు వేస్తారా అని చూసేవారు. మన కులాలను బానిసలుగా భావించేవారు. – ఈరోజు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పని లేదు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ... – జనం గుండెచప్పుడు జగనన్న. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారు. – వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న. – దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోంది. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారు. – 2014–19 మధ్య ఏ విధమైన సామాజిక న్యాయం చంద్రబాబు చేశారు? ఈరోజు ఏ విధమైన సామాజిక న్యాయం జరుగుతోందో చర్చకు సిద్ధం. – రూ.2.40 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేసి సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగనన్న ఉన్నారు. – ఏ ఎన్నికల్లో, ఏ పార్టీ మేనిఫెస్టోలో చూసినా జగనన్న పథకాలు కనిపిస్తాయి. – వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ల విధానం ఇస్తామని రాష్ట్రాలు చెబుతున్నాయి. – బాబుకే గ్యారెంటీ లేదు. ఆయన ఇంకేం గ్యారెంటీ ఇస్తాడు. బాబు గ్యారెంటీల్లోనూ జగనన్న స్పూర్తి ఉంది. -
అట్టడుగు వర్గాల ముందడుగు
సాక్షి, అమరావతి: ఏపీలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత నిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకు సింహ భాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రు లు నాటి మాయావతి నుంచి నేటి సిద్ధరామయ్య వరకు ఎవరూ చేయని రీతిలో ఆ వర్గాలకు సీఎం జగన్ సమున్నత గౌరవం ఇచ్చి సామాజిక సాధికారత సాధన దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయ సాధనలో దేశానికే టార్చ్బే రర్ (మార్గ దర్శకుడు)గా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. దేశానికే ఆదర్శం నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ రూ.2.11 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖా తాల్లో (డీబీటీ) జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల ఖాతాల్లోకే రూ. 1,56,987.64 కోట్లు వేశారు. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ బాటలు వేశారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦ నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్ పదవులిచ్చారు. ఇలా చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ♦ 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ ప దవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇ చ్చా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు (58 శాతం) ఆ వ ర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి.. 484 నామినేటెడ్ డైరెక్టర్ పద వులుంటే అందులో 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ♦ బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే చైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులుంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ చైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో సగభాగం 3,503 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు. చేతల్లో సామాజిక న్యాయం ♦ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి, రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ♦ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురి(80 శాతం)ని ఆ వర్గాల నుంచే నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70%) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. స్థానిక సంస్థల్లో.. ♦ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే.. వాటికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు. ♦ 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగాను 12 పదవులు (86 శాతం) ఇచ్చారు. -
కులగణనలో ఓబీసీలను చేర్చొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణన–2021లో వెనకబడిన వర్గాలను చేర్చొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఓబీసీల వివరాల్లో కచి్చతత్వం లేదని తెలిపింది. 2021 కులగణనలో ఎస్సీ, ఎస్టీల లెక్కలను మాత్రమే సేకరించి, ఇతర కులాలను మినహాయించాలనేది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీల కులగణన కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పరిగణనలోకి తీసుకోవద్దంటూ కేంద్ర సామాజిక సాధికారత శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ మేరకు పేర్కొంది. జనవరి 7, 2020న జారీ చేసిన నోటిఫికేషన్లో 2021 కులగణనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలను మాత్రమే చేర్చామని కేంద్రం తెలిపింది. 2021 కులగణనలో గ్రామీణ భారతంలోని వెనకబడిన వర్గాల సామాజిక–ఆర్థిక డాటాను పొందుపరచాలని సెన్సస్ విభాగానికి ఆదేశాలు ఇవ్వొద్దని, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 8లో పొందుపరిచిన విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. ఓబీసీల కులగణన చేపట్టడానికి రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్‌కు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేవని తెలిపింది. కులగణనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను హైకోర్టులు, సుప్రీంకోర్టు గతంలో కొట్టివేశాయని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం వద్ద ఉన్న మహారాష్ట్రలోని ఓబీసీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 90 రోజుల పరిమితి అమల్లోకి.. పిటిషన్ దాఖలుపై సడలింపు తీసేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్లు దాఖలు చేయడానికి గతంలో ఇచ్చిన సడలింపు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అక్టోబరు 1 నుంచి పిటిషన్ దాఖలుకు 90 రోజుల కాలపరిమితి అమల్లోకి వస్తుందని తెలిపింది. కరోనా నేపథ్యంలో సుమోటోగా ఇచి్చన సడలింపులు నిలిపివేయాలని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ నిర్ణయించింది. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు పేర్కొంది. మూడో వేవ్ పొంచి ఉందంటూ ఈ ఏడాది చివరి వరకూ సడలింపు ఇవ్వాలన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మీరు నిరాశపడకండి. మూడో వేవ్‌ను ఆహ్వానించకండి’’ అని న్యాయవాదులనుద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. హైకోర్టుల తీర్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి 90 రోజుల కాల పరిమితి అమల్లోకి తీసుకురావాలంటూ ఈ ఏడాది మార్చి 8న అటార్నీ జనరల్ కోర్టును కోరిన విషయం విదితమే. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికలకు సంబంధించి దాఖలు చేసే పిటిషన్లకు కాలపరిమితి విధించాలని ఎన్నికల కమిషన్ కోరింది. లేదంటే రాబోయే ఎన్నికలకు ఈవీఎం, వీవీప్యాట్లు తిరిగి ఉపయోగించలేని పరిస్థితి వస్తుందని పేర్కొంది. -
ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం
-
ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం
కర్నూలు బహిరంగసభలో సీఎం సామాజిక సాధికారిత మిషన్ ప్రారంభం ఆర్థికసంఘం కేటాయింపుల్లో అన్యాయం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కుటుంబ సభ్యులందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కుటుంబానికి 20 కిలోల బియ్యం పంపిణీ చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనను ఎత్తేస్తామని చెప్పారు. కర్నూలులో శుక్రవారం ఆయన సామాజిక సాధికారిత మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసుకు వెళ్లలేని వృద్ధులకు ఇంటివద్దే పింఛను ఇస్తామని, వేలిముద్రలు పడలేని స్థితి ఉంటే ఐరిస్ ద్వారా పింఛన్లు ఇస్తామని చెప్పారు. సామాజిక సాధికారిత పథకాన్ని తొమ్మిది ప్రభుత్వశాఖల సమన్వయంతో అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రసూతి, పిల్లల మరణాలతో పాటు చదువుకునే వయసున్న పిల్లలను బడికి పంపించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసంఘం కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు.ఈ పరిస్థితుల్లో 24 గంటలు కష్టపడినా ఇతర రాష్ట్రాల కంటే ముందుకు వెళ్లలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలను తలదన్నేలా రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపార అవకాశాలన్నీ డ్వాక్రా సంఘాలకే డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని, వాటిని ప్రపంచంలోనే ఆదర్శంగా తయారు చేస్తానని చెప్పారు.రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ అప్పగిస్తామని తెలిపారు. పోలవరం కంటే ముందే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 70 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోకి మళ్లిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు రావెల , కామినేని ప్రసంగించారు. కాంగ్రెస్.. రాయలసీమకు శాపం: సీఎం సాక్షి ప్రతినిధి, కడప: జలయజ్ఞంలో కోట్లాది రూపాయల పనులు చేసినా నీరు లేదని, రాయలసీమకు కాంగ్రెస్ శాపంగా మారిందని సీఎం చంద్రబాబు చెప్పారు. రాయలసీమను కరువు నుంచి బయపడేలా చేస్తానన్నారు. వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టును శుక్రవారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గండికోటకు శంకుస్థాపన చేసింది తానేనని, నీరు తీసుకొచ్చేవరకు విశ్రమించనని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామాలయానికి ప్రభుత్వం తర ఫున పట్టువస్త్రాలు పంపుతామని చెప్పారు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం, ఒంటిమిట్టను కలిపి టూరిజం సర్క్యూట్ చేస్తామని తెలిపారు. చదువుతోపాటు నైపుణ్యాల అభివృద్ధి ముఖ్యం సాక్షి ప్రతినిధి, తిరుపతి: చదువుతోపాటు నైపుణ్యాల అభివృద్ధి ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం వెలికితీయడంతోపాటు, తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 2014లో పదో తరగతి, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిభ అవార్డులు అందుకున్న విద్యార్థులను శని, ఆదివారాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వీరు రూ.300 టికెట్ క్యూలో ఉచితంగా వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు. రక్షణ వలయంలో సీఎం పర్యటన ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పూర్తి పోలీసు రక్షణ వలయంలో నిర్వహించారు. సీఎం పర్యటనకు హాజరుకాకుండా ప్రజాప్రతినిధుల్ని నిర్బంధించారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో ఏర్పడిన అఖిలపక్షం రెండు రోజుల పాటు పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దీనిపై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించిన స్థానిక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సహా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, రఘురామిరెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, సీపీఎం, సీపీఐ, రైతుసంఘాల ప్రతినిధులను గుర్రప్పకోన వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సీఎంకు సమస్యలను వివరించాలని భావించిన బీఈడీ అభ్యర్థుల్ని యర్రగుంట్లలోనే అడ్డగించారు. ఎమ్మార్పీఎస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.