సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాన్ తీవ్ర వాయువేగంతో దూసుకొస్తోంది.పెథాయ్ తుపాన్ పశ్చిమ బంగాళాఖాతానికి అనుకొని కొనసాగుతోంది. మచిలీపట్నానికి తూర్పున ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలోను, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ, దూరంలో కేంద్రికృతమైంది. శ్రీహరికోటకు 280 కిలోమీటర్ల దూరంలోను, ఉత్తర వాయువ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
ఇది మరింత బలపడి రాత్రికి తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం నాటికి కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో తాళ్లరేవు, కాజులూరు, తుని పాటు, తొణంగిలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
విశాఖ, గాజువాక, భీమునిపట్నం, పరవాడ, పెదగంట్యాడ, అచ్యుతాపురం, రాంబిలి, ఎస్. రాయవరం, పాయకరావు పేటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో భారీ వర్షలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గార, పలాస, మందస, సంతబొమ్మాళి, కవిటి, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నాయని ఆధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment