సాక్షి, నెల్లూరు : పెథాయ్ తుపాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి తగిన చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కట్టర్లు, జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు ఆహారం అందించడానికి తగిన ఏర్పాట్లు వేగంగా చేయాలన్నారు. తుపాను ప్రభావం కలిగిన గంటల్లోనే సహాయక చర్యలు ప్రజలకు అందాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment