
(ఫైల్ ఫోటో)
సాక్షి, శ్రీకాకుళం: తుపాను హెచ్చరికలపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తీర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వలలు, పడవలు నష్టపోకుండా ముందస్తుగా తరలించాలన్నారు. ఆరుబయట పంటలను కాపాడుకునేందుకు, వ్యవసాయశాఖ సూచనలు పాటించాలని పేర్కొన్నారు.