అంగన్‌వాడీలకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని ఆ పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు.
విజయనగరం : అంగన్‌వాడీలకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని ఆ పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలను అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వం జిల్లాలో పలు అంగన్‌వాడీలను, వీఆర్‌ఏలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్ట్‌లకు నిరసనగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తామని ఆయన అన్నారు.
(చీపురుపల్లి)