
బుద్దాలపాలెం వద్ద జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీలు
సాక్షి, అమరావతిబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలంగాణలో ఇస్తున్న దానికంటే రూ.వెయ్యి జీతం ఎక్కువ ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్ర నిర్వహిస్తున్న ఆయన్ను కృష్ణా జిల్లా బుద్దాలపాలెం వద్ద శనివారం అంగన్‌వాడీ కార్యకర్తలు కలిసి వారి సమస్యలు విన్నవించారు. ‘ అన్నా.. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.
ఇక్కడికొస్తే మాపై చర్యలు తీసుకుంటారని తెలుసు. అయినా మేం భయపడకుండా వచ్చాం. మీరు గెలిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో రూ.10,500 జీతం ఇస్తుంటే ఇక్కడ కేవలం రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. ఇలాగైతే మేం ఎలా బతకాలన్నా..’ అంటూ వాపోయారు. వారి సమస్యలు ఓపికగా విన్న జననేత.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువ ఇస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment